అడవి (అయోమయనివృత్తి)
అడవి అనే పదం ఎన్నో తెలుగువారి గ్రామనామాల్లో ఉత్తరపదంగా ఉంది. కొన్ని గ్రామాల్లో పూర్వపదంగా కూడా రావడమూ కద్దు. గ్రామనామాల్లో ఈ పదం భౌగోళిక, నైసర్గిక స్థితి సూచకంగా గుర్తిస్తున్నారు.
అర్థం
మార్చుఅడవి అన్న పదానికి చెట్లతో దట్టంగా అల్లుకున్న ప్రదేశమని అర్థం. అడవి అన్న పదం చాలా గ్రామనామాల్లో అటవీ ప్రాంతాన్ని సూచిస్తూంటుంది. అడవి పదం ఆ గ్రామం నైసర్గిక స్థితిని తెలియజేస్తూ ఉంటుంది.[1]
చరిత్ర
మార్చుఅడవి అన్న పేరుతో ఏర్పడిన గ్రామం భౌగోళికంగా అడవికి బాగా దగ్గరగా ఉండడమో, అటవీ ప్రాంతంలోనే ఉండడమో జరుగుతూంటుందని గ్రామనామాధ్యయనాలు సాగించిన పలువురు పరిశోధకులు తేల్చారు. పట్టణీకరణ, వృక్షసంపదను కొట్టి గ్రామాలను విస్తరించడం వంటి పరిణామాల వల్ల అడవి పేరు గ్రామనామాల్లో ఉన్నా భౌగోళికంగా అడవి ఆ చుట్టుపక్కల లేకుండా అయిపోయిందని పేర్కొంటున్నారు. కనుక ఈ పేరును ఆధారం చేసుకుని భూగర్భ, భౌగోళిక, చరిత్ర తదితర శాస్త్ర అధ్యయనకారులు అటవీభూములు ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉండేవో, అవి ఏ దశలో కుంచించుకుపోయాయో వంటి వివిధ అంశాలపై స్పష్టత సాధిస్తున్నారు.
ఉదాహరణలు
మార్చుఉత్తరపదంగా
మార్చుగ్రామాల పేర్లలో వచ్చే చివరి పదాన్ని సాంకేతికంగా ఉత్తరపదం అని వ్యవహరిస్తారు. అడవి అనే పదం చాలా గ్రామాలకు ఉత్తరపదంగా ఉంది.
పూర్వపదంగా
మార్చుకొన్ని గ్రామనామాల్లో అడవి అన్న పదం పూర్వపదంగా ఉంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 228