అగస్టా అడా కింగ్, కౌంటెస్ ఆఫ్ లవ్‌లేస్ (డిసెంబరు 10, 1815 - నవంబరు 27, 1852) ఒక ఆంగ్ల గణితశాస్త్రవేత్త, రచయిత్రి. ఈమె ఛార్లెస్ బాబేజ్ నిర్మించ తలపెట్టిన అనలిటికల్ ఇంజన్ అనబడే గణన యంత్రం మీద చేసిన కృషికి ప్రసిద్ధురాలు. ఈమె గణన యంత్రాలు కేవలం లెక్కల కోసమే కాదని, అంతకు మించిన అవసరాలకు ఉపయోగపడతాయని ఊహించింది.

ద కౌంటెస్ ఆఫ్ లవ్‌లేస్
అగస్టా అడా కింగ్, 'కౌంటెస్ ఆఫ్ లవ్‌లేస్, daguerrotype portrait circa 1843
Daguerreotype by Antoine Claudet (సుమారు 1843)[1]
జననంఅగస్టా అడా బైరన్
(1815-12-10)1815 డిసెంబరు 10
లండన్, ఇంగ్లండ్
మరణం1852 నవంబరు 27(1852-11-27) (వయసు 36)
మేరీలెబోన్, లండన్, ఇంగ్లండ్
ప్రసిద్ధిగణితశాస్త్రం, గణన
సంతకం

అడా బైరన్ ప్రముఖ కవి లార్డ్ బైరన్, సామజిక ఉద్యమకారిణి అన్నె ఇసబెల్లా మిల్బాంకెల చట్టబద్ధమైన వివాహం ద్వారా జన్మించిన ఏకైక కుమార్తె.[2]

మూలాలు

మార్చు
  1. "Only known photographs of Ada Lovelace in Bodleian Display". Bodleian. 2015. Retrieved 10 October 2017.
  2. "Ada Lovelace Biography". biography.com. 6 May 2021.