అతిధ్వనుల అనువర్తనాలు
భౌతిక శాస్ర్తము, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రములలో విభిన్న క్షేత్రాలలో అతిద్వనుల ఉపయోగలు అనేకం ఉన్నాయి.వాటిలోకొన్ని: 1.పదార్థ నిర్మాణన్ని కనుగొడం,2.లోహాలలో పగుళ్ళని గుర్తించడం,3.శుభ్రం, శుద్ధి చేయడం,4.సముద్రపు లోతును కనుగొనడం,5.దిశా సంకేతాలు పంపడం,6.స్పటికాల స్థితి స్తాపక సౌష్టవం,7.నీటిలోపల ఉండే జలాంతర్గాతములు, మంచు దిమ్మెలు, ఇతర వస్తువుల ఆచూకి కనుగొనడం,8.లోహ మిశ్రమాల తయారి,9.రసాయనిక ప్రభావం,10.స్ఫటికీకరణ,11.జైవిక ప్రభావము,12.సొల్డరింగ్, లోహాలను కత్తిరించడం,13. వైద్యరంగంలో ప్రయోజనాలు.[1]
పదార్థ నిర్మాణాన్ని కనుగొనడం
మార్చుఅతి ధ్వనుల పౌనఃపునన్యాలు పదార్థ అణువుల కంపన, భ్రమణ పౌనఃపున్యాలతో పోల్చదగినగా ఉంటాయి. కావవున అతిధ్వనుల్ని ఉపయోగించి అణువుల శక్తిని కనుగొనవచ్చు.ద్రవాలు, వాయువులలో అతిధ్వని వేగాన్ని నిర్ణయించడం, ఈ వేగం పౌనఃపున్యం, ఉష్ణోగ్రత మొదలైనవాటితో ఏ విధంగా మారుతుందో కనుగొనడం వల్ల యానకం యొక్క సంపీడ్యత, విశిష్టోష్ణం, రసాయనిక నిర్మాణం మొదలైన వాటిని తెలుసుకోవచ్చు.
లోహాలలో పగుళ్ళని గుర్తించడం
మార్చుఅతిధ్వనులను ఉపయోగించి లోహాలలో పగుళ్ళను గుర్తించవచ్చును.లోహాలలో పగులు ఉన్న దగ్గర యానకం మారుతుందని మనకు తెలుసు.దీని కారణముగా అతిధ్వనులు పరావర్తనం చెందుతాయి.కావున అతిధ్వని తరంగాలు రంధ్రం లేదా పగులు ఉన్న లోహాము గుండా ప్రయాణించినప్పుడు, గుర్తించదగిన పరావర్తనం చెందుతాయి.లోహాంయొక్క రెండవ చివరకూడా పరావర్తనము సంభవిస్తుంది.ఈ పరావర్తిత సంకేతాలను గ్రాహకం గ్రహిస్తుంది.వీటిని వర్థనం చేస్తారు. ఈ సంకేతాలను కేథోడ్ కిరణ డోలనదర్శినికి అనువర్తిపజేస్తారు.పగులు, లోహము చివర నుండి వచ్చే ప్రసారిత, పరావర్తిత సంకేతాలు శిఖరాలనేర్పరుస్తాయి.C.R.O. పై ఉన్న రెండవ శిఖరం యొక్క స్థానం ద్వారా పగులు దూరాన్ని కనుగొనవచ్చు.[2]
శుభ్రం , శుద్ధి చేయడం
మార్చుఅతిధ్వనులు వంట పాత్రలను శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, పొగ గొట్టాలను శుద్ధి చేయడానికి ఉపయోగించవచ్చు.
సముద్రపు లోతును కనుగొనడం
మార్చుఅధిక పౌనఃపున్యం గల అతివేగ తరంగాలను సముద్రపు అడుగునకు పంపి, పరావర్తిత తరంగాలను గ్రహిస్తారు.డోలన దర్శిని ద్వర అతిధ్వని తరంగాలు బయలుదేరిన సమయానికి, ప్రతిధ్వనికి మధ్యగల కాల వ్యవధిని గుర్తిస్తారు.సముద్రపు నీటిలో ధ్వని వేగం మనకు తెలుసు.కాబట్టి కాలువ్యవద్ధి ద్వారా సముద్రపు లూతు కనుగొనవచ్చు.
దిశా సంకేతాలు పంపడం
మార్చుఅతి ధ్వనుల తరంగధైర్ఘ్యం చాలా తక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ వివర్తనము చెందుతాయి.కావున అతి ధ్వనులను నిర్దిష్టమైన దిశలో సంకేతాలను పంపడానికి ఉపయోగిస్తారు.
స్ఫటికాల స్థితిస్థాపక సౌష్ఠవాలు
మార్చుఅతి ధ్వనులను స్ఫటికాలపై ప్రయోగించినప్పుడు అవి స్థితిస్థాపక సౌష్ఠవాలను చూపించే వివర్తన ప్రతిబింబలనేర్పరుస్తాయి.
సముద్రాలలో జలాంతర్గాములు,మంచు దిమ్మెలు , ఇతర వస్తువులను గుర్తించడం
మార్చుఅతిధ్వని తరంగాలను సముద్రం అతర్భాగములోనికి వివిధ దిశలలో పంపిస్తారు.ఏ దిశలోనైనా తరంగాలు పరావర్తనము చెందితే, ఆ దిశలో ఏదేని వస్తువు ఉన్నది అని అర్ధం.సముద్రము యొక్క అట్టడుగున ఉన్న చిన్నచిన్న వస్తువుల కూడా అతిధ్వనుల సహాయంతో గుర్తిచవచ్చు.[3]
లోహాల మిశ్రమాన్ని తయారుచేయడం
మార్చుఅతి ధ్వని తరంగాల ద్వారా వేర్వేరు సాంద్రతలు ఉన్న లోహాలను ఏకరీతి మిశ్రమముగా కలపవచ్చు.కావున ఏకరీతి పరిమాణం గల లోహ మిశ్రమాన్ని సులభముగా పొందవచ్చు.
రసాయనిక ప్రభావము
మార్చుఅతిధ్వనులు ఉత్ర్పేరకాలుగా పనిచేసి, రసాయన చర్యా వేగాన్ని పెంచుతాయి.ఆ అతి ధ్వనుల సమీక్షములో ఆక్సీకరణ చర్యలు అత్యంత వేగంగా జరుగుతాయి.అతిధ్వనుల ప్రభావముతో పాలిమర్లు విచ్ఛిన్నంచెందుతాయి.
స్ఫటికీకరణ
మార్చుఅతిధ్వనుల ప్రభావముతో స్ఫటికీకరణ రేటు మారుతుంది.అతిద్వనులను ఉపయోగించి స్ఫటికాలని చిన్నవిగా, ఏకరీతిగా తయారుచేయవచ్చు.
జైవిక ప్రభావము
మార్చుకప్పలు, చేపలు వంతి జీవిలపై అతిధ్వనులను ప్రయోగించినప్పుడు అవి చనిపోవడంగాని తీవ్రముగా గాయపడడం గాని జరుగుతుంది.అతిధ్వనుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడే ఇది సాద్యపడుతుంది.అతిధ్వనులను ఉపయోగించి హానికర క్రిములను, బాక్టీరియలను నిర్మూలిచవచ్చు.అతిధ్వనులను నీరు, పాలను శుద్ధి చేయడానికి ఉపయోగింస్తారు.
సోల్డరింగ్ , లోహాలను కత్తిరించడం
మార్చుఅతిధ్వనులను లోహాలలో రంధ్రాలు చేయడానికి, లోహాల్ని కత్తిరించడానికి వాడతారు. అతిధ్వనులను ఉపయోగించి లోహాలను అతికించడం కుడా చేయవచ్చు.
వైద్యరంగంలో ప్రయోజనాలు
మార్చువైద్యరంగంలో అతిధ్వనులను శరీర అంతర్భాగాలను పరిశీలించేందుకు, రోగగ్రస్థ కణజాలం నిర్మూలించేటందుకు, చెడిపోయిన కణజాలాన్ని బాగుచేయడానికి ఉపయిగిస్తారు.కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పుల నివారణలో అతిధ్వనులను ఉపయోగిస్తారు.కిడ్నిలలోని రాళ్ళను నిర్మూలించడానికి కూడా అతిధ్వనులను వాడుతున్నారు.శరీర అంతర్భాగాల్ని పరిశీలిచడంలో అతిధ్వనులు X-కిరణాల కన్నా సమర్ధవంతముగా పనిచేస్తాయి.కొన్ని రకాల క్యా ంసర్ కణితుల సాంద్రతలలో ఉండే అతి స్వల్ప తేడాలు గుర్తించడంలో X -కిరణాలు అంత ఉపయోగకరం కాదు.గర్భములో ఉన్న శిశువుకు సంబంధిచిన సమాచారాన్ని తెలుసుకోవడములో అతిధ్వనులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.కణజాలం గుండా అతిధ్వనులు ప్రసారము చేసిన్నప్పుడు దాని సాంద్రత, స్థితిస్థాపకతల ఆధారముగా అతిధ్వనులు వేర్వేరు డిగ్రీలలో పరావర్తనము చెందుతాయి.కణజాలము యొక్క నిరోధము కారణముగా అంతర్గత ఉష్ణాన్ని జనింపజేసే డయాథర్మిక్ సాధనాలను ఫిజికల్ థెరపీలో విస్తారముగా వాడుతున్నారు.అతిధ్వనులను ఉపయోగించడం ద్వారా సంప్రదాయ శస్త్ర చికిత్సలో కన్నా అతి తక్కువ పరిమాణములో శరీరంపై గాటు లేదా రంధ్రాలు చేయడం ద్వారా శస్త్ర చికిత్స చేయడం వీలవుతుంది.ఈ పద్ధతి మెదడు, చెవి వంటి భాగాలపై చేసే సున్నితమైన శస్త్ర చికిత్సలో ఉపయోగిస్తున్నారు.