కొన్ని పదార్థాల్లో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద విద్యుత్ నిరోధం పూర్తిగా తొలగిపోతుంది, అయస్కాంత క్షేత్రం ఉనికిని కోల్పోతుంది. ఈ స్థితినే అతివాహకత్వము (Superconductivity) అంటారు. ఆ పదార్థాలను అతివాహకాలు (Superconductors) అంటారు. సాధారణ లోహ వాహకాలలో ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ విద్యున్నిరోధం క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ అతివాహకాలలో మాత్రం సందిగ్ధ ఉష్ణోగ్రత (Critical temperature) వద్ద ఒక్కసారిగా నిరోధం సున్నా అయిపోతుంది.[1][2] ఇలాంటి స్థితిలో ఒక అతివాహక తీగ వలయంలో విద్యుత్ ని ఒక్కసారి ప్రవేశ పెడితే, మళ్ళీ బయటి మూలంతో ప్రమేయం లేకుండా అలా ప్రసరిస్తూనే ఉంటుంది.[3][4][5][6]

అయస్కాంతం పైన గాలిలో తేలుతున్న అధిక తాప అతివాహకం. మీస్నర్ ఫలితం వల్ల అతివాహకం ఉపరితలం మీద ఎడతెగకుండా విద్యుత్ ప్రవహించి విద్యుదయస్కాంతంగా మారి అయస్కాంతాన్ని వికర్షిస్తుంది.

మూలాలు

మార్చు
  1. Combescot, Roland (2022). Superconductivity. Cambridge University Press. pp. 1–2. ISBN 9781108428415.
  2. Fossheim, Kristian; Sudboe, Asle (2005). Superconductivity: Physics and Applications. John Wiley and Sons. p. 7. ISBN 9780470026434.
  3. Bardeen, John; Cooper, Leon; Schrieffer, J. R. (December 1, 1957). "Theory of Superconductivity". Physical Review. 108 (5): 1175. Bibcode:1957PhRv..108.1175B. doi:10.1103/physrev.108.1175. ISBN 978-0-677-00080-0. S2CID 73661301. Retrieved June 6, 2014. Reprinted in Nikolaĭ Nikolaevich Bogoliubov (1963) The Theory of Superconductivity, Vol. 4, CRC Press, ISBN 0677000804, p. 73.
  4. Daintith, John (2009). The Facts on File Dictionary of Physics (in ఇంగ్లీష్) (4th ed.). Infobase Publishing. p. 238. ISBN 978-1-4381-0949-7.
  5. Gallop, John C. (1990). SQUIDS, the Josephson Effects and Superconducting Electronics (in ఇంగ్లీష్). CRC Press. pp. 1, 20. ISBN 978-0-7503-0051-3.
  6. Durrant, Alan (2000). Quantum Physics of Matter. CRC Press. pp. 102–103. ISBN 978-0-7503-0721-5.