అద్దంకి గంగాధర కవి తొలి తరం తెలంగాణ కవులలో ఈయన ఒకరు.[1] కుతుబ్ షాహీలకు తెలుగు కావ్యాన్ని పరిచయం చేసిన మొదటి కవి.

జీవిత విశేషాలుసవరించు

అద్దంకి గంగాధర కవి గోల్కొండను పాలించిన ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థాన కవిగా పనిచేశారు. ఇబ్రహీం కుతుబ్ షాపై ఉన్న గౌరవంతోతపతీ సంహరణము అనే కావ్యాన్ని రచించి ఆయనకు అంకితం ఇచ్చారు. కుతుబ్ షాహీలకు తెలుగు కావ్యమును అంకితం చేసిన మొదటివాడిగా అద్దంకి గంగాధర కవి గుర్తింపు పొందాడు. ఇబ్రహీం కుతుబ్ షా కోరికమేరకు నన్నయ భారతంలోని 22 పద్యగద్యాలలో ఉన్న ఉపాఖ్యాన్ని 414 పద్యగద్యాల శృంగార ప్రబంధంగా మార్చాడు.

రచనలుసవరించు

  • తపతీ సంహారణోపాఖ్యానం

మూలాలుసవరించు

  1. తెలంగాణ సహితీ వైశిష్ట్యం, ఆచార్య ఎస్వీ రామారావు