అనర్ఘరాఘవం

(అనర్ఘ రాఘవం నుండి దారిమార్పు చెందింది)

అనర్ఘరాఘవ ( దేవనాగరి अनर्घराघव ) రామాయణం యొక్క ఒకానొక నాటకీయ వర్ణనా రచన., ఇది సంస్కృత కవిత్వం యొక్క అత్యంత సవాలుగా ఉన్న శాస్త్రీయ రచన అని విశ్లేషకుల అభిప్రాయము . దీనిని క్రీ. శ.8వ లేదా 10వ శతాబ్దపు మధ్య కొంత కాలం జీవించిన మురారిఅనే బ్రాహ్మణ ఆస్థాన కవి. బహుశా ఒరిస్సాలో లేదా పొరుగున ఉన్న దక్షిణ భారతదేశంలో జీవించిన ఈ కవిరచించిన రచననలలో మనకు లభ్యమవుతున్న ఏకైక రచన ఇది. దీని సొగసైన శైలి, కవి ఎంచుకున్న ఉపమానాలు, తరచుగా వాడే అద్భుతమైన చిత్రాల కారణంగా, ఈ నాటకం సంస్కృత పండితులకు చాలా ఇష్టమైనది.రామ-కథను కుతంత్రాల కథగా అందించడంలో, మురారి భవభూతి యొక్క మహావీరచరిత సంప్రదాయాన్ని అనుసరిస్తాడు, కానీ రంగస్థల ప్రపంచం నుండి తన సమాంతరాలతో దానిని పునరుద్ధరించాడు.

ఈ నటకానికి ఏడు అంకాలు. ప్రథమాంకం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ రక్షణార్ధం తన వెంట తీసుకువెళ్ళడంతో ముగుస్తుంది. రెండో అకంలో రావణాదుల పరిచయం, తాటక వధ, మిథిలా ప్రయాణం వర్ణించారు మురారి. రావణుడు సీతను వివాహామాడ దలచుకోవడంతో మొదలయ్యే మూడో అంకం రాముడు హరివిల్లు విరవడం, రావణుని పురోహితుడు శేషల్కుడు దీనికి ప్రతీకారం తప్పదని రాముని బెదిరంచడంతో పూర్తవుతుంది. ఇక నాలుగో అంకంలో రావణుని మంత్రి మాల్యవంతుడు సీతా రాములకు వియోగం కలగాలనీ, కైకేయి ద్వారా రామునికి వనవాసమయ్యేట్లు చేయమని శూర్పణకను ప్రేరేపిస్తాడు. రామ పరశురాముల సంభాషణ, రామునికి రాజ్యాభిషేకం చేస్తానని దశరథుడు ప్రకటించడం, కైకేయి వరాలను తెలుపుతూ మంథర ప్రవేశించడం, అవి విని దశరథుడూ మూర్చిల్లడంతో నాలుగో అంకం పూర్తవుతుంది. రాముడు వనవాసంలో ఎందరో రాక్షసుల్ని సంహరించినట్టు జాంబవంత, శ్రమణుల సంభాషణ ద్వారా చెప్తూ పంచమాంకం మొదలవుతుంది, సీతాపహరణం, జటాయు మరణం, వాలి సంహారం, సుగ్రీవ పట్టాభిషేకం ఉంటాయి ఈ అంకంలో. ఆరవ అంకంలో రావణుని గూఢచారులు శుక, సారణులు రాముడు సేతుబంధనం చేశాడని మాల్యవంతునికి వివరిస్తారు. కుంభ, ఇంద్రజిత్తులతో రామ యుద్ధం, రావణ వధతో ఈ అంకం పూర్తవుతుంది. ఆఖరిది అయిన సప్తమాంకంలో సీతారాములు, లక్ష్మణ, హనుమంతాదులు పుష్పకవిమానంపై అయోధ్య పయనం, సుమేరు, చంద్ర లోకాలు, నదులు, ఉపనదుల వర్ణనలు ఉంటాయి. రాముని రాజ్యాభిషేకంతో నాటకం ముగుస్తుంది.

అనువాదాలు మార్చు

  • రామచంద్ర మిశ్రా ద్వారా సంస్కృత వ్యాఖ్యానం, హిందీ అనువాదంతో అనర్ఘరాఘవం, వారణాసి: చౌకంబా విద్యా భవన్, 1960.
  • అనర్ఘరాఘవ: దాస్ స్చౌస్పీల్ వోమ్ కోస్ట్‌బరెన్ రఘుస్ప్రాస్. Einführung und Übersetzung కరిన్ స్టైనర్ ద్వారా, డ్రామా అండ్ థియేటర్ ఇన్ సుడాసియన్, వైస్‌బాడెన్: హారస్సోవిట్జ్ వెర్లాగ్, 1997.
  • రామ బియాండ్ ప్రైస్ ద్వారా జుడిట్ టోర్జ్సోక్, క్లే సంస్కృత లైబ్రరీ, 2006.