అనిత ఆర్. రాధాకృష్ణన్
అనిత ఆర్. రాధాకృష్ణన్ (జననం 1951 సెప్టెంబరు 19) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరు సార్లు శాసనసభకు ఎన్నికై, 2002 నుండి 2006 వరకు హౌసింగ్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, ప్రస్తుతం ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మృత్స్యకార, పశుసంవర్ధక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]
అనిత ఆర్. రాధాకృష్ణన్ | |||
మత్స్యశాఖ, మత్స్యకారుల సంక్షేమం, పశుసంవర్ధక శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 7 మే 2021 | |||
ముందు | డి. జయకుమార్ | ||
---|---|---|---|
హౌసింగ్ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2002 – 12 మే 2006 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 మే 2001 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తండుపతు, ఉడంగుడి, తూత్తుకూడి, తమిళనాడు, భారతదేశం | 1951 సెప్టెంబరు 19||
రాజకీయ పార్టీ | ద్రవిడ మున్నేట్ర కజగం | ||
నివాసం | మధురై, తమిళనాడు, భారతదేశం |
రాజకీయ జీవితం
మార్చుఅనిత ఆర్. రాధాకృష్ణన్ అన్నాడీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2001లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుచెందూర్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జయలలిత మంత్రివర్గంలో 2002 నుండి 2006 వరకు హౌసింగ్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన 2006లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాధాకృష్ణన్ ను 2009 జూలై 30న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నుండి బహిష్కరించింది.[2] ఆయన ఆ తరువాత డీఎంకే పార్టీలో చేరి 2009లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఆ తరువాత వరుసగా 2011, 2016, 2021 ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర మృత్స్యకార, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3][4]
ఎన్నికల్లో పోటీ
మార్చుఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం |
---|---|---|---|
2001[5] | తిరుచెందూర్ | అన్నాడీఎంకే | గెలుపు |
2006[6] | తిరుచెందూర్ | అన్నాడీఎంకే | గెలుపు |
2009 | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
2011[7] | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
2016[8] | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
2021[9] | తిరుచెందూర్ | డిఎంకె | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ Zee News Telugu (6 May 2021). "తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం రేపే, 34 మందితో మంత్రివర్గం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ "AIADMK expels 2 of its MLAs". The Hindu. Chennai, India. 30 July 2009. Archived from the original on 1 August 2009.
- ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2001 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2006 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2011 TO THE LEGISLATIVE ASSEMBLY OF TAMIL NADU".
- ↑ "Tamil Nadu General Legislative Election 2016, Election Commission of India".
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.