అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి

అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండు సార్లు సంపర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి
అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
ముందు పిల్లి అనంత లక్ష్మి
నియోజకవర్గం సంపర

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989- 1994
ముందు తిరుమాని సత్యలింగ నాయకర్
తరువాత తిరుమాని సత్యలింగ నాయకర్
నియోజకవర్గం సంపర

వ్యక్తిగత వివరాలు

జననం 1954
నాగులపల్లి యు.కొత్తపల్లి మండలం, కాకినాడ జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
మరణం 2024 మే 28
నాగులపల్లి
విశ్రాంతి స్థలం నాగులపల్లి
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి రత్నం
సంతానం ఒక కుమారుడు

రాజకీయ జీవితం

మార్చు

అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1987లో కొత్తపల్లి ఎంపీపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1989 జరిగిన శాసనసభ ఎన్నికల్లో సంపర నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి తిరుమాని సత్యలింగ నాయకర్ పై 4967 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత జరిగిన ఎన్నికలలో పోటీ చేయకుండా తిరిగి 2004లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[2] ఆ తరువాత రాజమండ్రి ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్‌గానూ పని చేశాడు.

బుల్లిఅబ్బాయిరెడ్డి విద్యాభివృద్ధి కోసం మృతిచెందిన తన కుమారుని పేరుతో కొత్తపల్లిలో వీవీఎస్‌ విద్యా సంస్థలను ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించాడు. ఆయన 2009లో రాజకీయాలకు దూరంగా ఉండి 2018లో జనసేన పార్టీలో చేరాడు.

అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో 2024 మే 28న నాగులపల్లిలోని ఆయన స్వగృహంలో మరణించాడు. ఆయన భార్య రత్నం, ఒక కుమారుడు ఉన్నారు.[3][4][5]

మూలాలు

మార్చు
  1. Elections in India (1989). "Andhra Pradesh Assembly Election Results in 1989". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  2. Rediff (2004). "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  3. Sakshi (28 May 2024). "మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  4. Andhrajyothy (29 May 2024). "మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లిఅబ్బాయిరెడ్డి కన్నుమూత". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  5. The Hindu (28 May 2024). "Former Congress MLA passes away due to prolonged illness" (in Indian English). Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.