అనిస్‌ ముఖ్తదిర్‌ మహమ్మద్‌

అనిస్‌ ముఖ్తదిర్‌ మహమ్మద్‌ తెలుగు రచయిత.

బాల్యముసవరించు

అనిస్‌ ముఖ్తదిర్‌ మహమ్మద్‌ .... నల్గొండ జిల్లా నల్గొండలో 1967 మార్చి23న జన్మించారు. వీరి తల్లితండ్రులు: అహమ్మదున్నీసా బేగం, మహమ్మద్‌ ఖయ్యూం. చదువు: బి.ఏ.

వృత్తిసవరించు

రాష్ట్ర ప్రభుత్వ వ్యయసాయశాఖ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ సామాజిక కార్యకర్త.

రచనా వ్యాసంగముసవరించు

ఉద్యోగుల సమస్యల మీదవ్యాసాలు రాయడం ఆరంభించ డముతో వీరి రచనా వ్యాసంగము ప్రారంబమైనది. సామాజిక అంశాల మీద 'ఇస్లామిక్‌ వాయిస్‌' పక్ష పత్రిక 2009 మార్చి సంచిక నుండి వరుసగా వ్యాసాలు వ్రాశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లింల సమస్యలను వివరిస్తూ, ఆ సమస్యల పరిష్కారం సూచిస్తూ 2009లో 'ముస్లిం మ్యానిఫెస్టో' చిరుపొత్తాన్ని రాసి ప్రచురించారు. లక్ష్య: సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, అసమానతల తొలగింపు దిశగా ప్రజలను చైతన్యపర్చడం.

మూలాలుసవరించు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 44