ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు) వయసులో పెద్దవాడైన పురుషుడిని అన్న లేదా అన్నయ్య (Elder Brother) అంటారు. అన్నయ్యలందరిలోకి పెద్దవాన్ని పెద్దన్న లేదా పెద్దన్నయ్య (Eldest Brother) అంటారు

చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

కుటుంబ నిర్వహణసవరించు

అన్న అనే వ్యక్తి కొన్ని బాధ్యతలు కలిగి ఉంటాడు.

  • కుటుంబంలో పెద్దవాడైతే తండ్రి తరువాత ఇంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది.
  • తమ్ముళ్ళ, చెళ్ళెళ్ళ చదువు సంద్యలు, పెళ్ళి విషయాలు బాధ్యతతో నిర్వర్తించవలసి ఉంటుంది.
  • తల్లిదండ్రుల యొక్క పోషణాభారం, వారి మరణానంతరం శ్రాద్దకర్మల బాధ్యత నిర్వర్తించవలసి ఉంటుంది.

ఇతర విషయాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అన్న&oldid=1464789" నుండి వెలికితీశారు