అపరిచిత (రష్యా నవల)

అపరిచిత అనేది రష్యన్ నవల.[1] ఆరోజుల్లో సోవియట్ రష్యా సాహిత్యం, విశాలాంధ్ర ప్రచురణ సంస్థ, వామపక్ష భావాలున్న కార్యకర్తలు, రచయితలు, ప్రచురణ సంస్థలు ఉద్యమస్ఫూర్తితో, గొప్ప సోవియట్ రచనలను అనువదించి ప్రచురించి తెలుగు ప్రజల కృతజ్ఞతలకు పాత్రులయ్యాడు అట్లూరి పిచ్చేశ్వరరావు. రష్యన నవల '"New comerను 'అపరిచిత' పేరుతో చక్కగా తెలుగు చేశాడు.[2]

నేపథ్యం

మార్చు

రష్యాలో విప్లవం తర్వాత లక్షలమంది విద్యావంతులైన యువతీయువకులు సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్టులు, కర్మాగారాలు, రోడ్లు, నిర్మాణాలలో స్వచ్ఛందంగా పనిచేయడానికి తరలివెళ్ళారు. కొందరు అజర్ బైజాన్ వంటి హిమప్రాంతాలలో, ఊసర, శీతల మరుభూముల్లోని సమిష్టి వ్యవసాయక్షేత్రాలలో, ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలలో పని చేయడానికి తరలి వెళ్ళారు.

నవల ఇతివృత్తం

మార్చు

దేశంకోసం అంకితమైన యువతీయువకుల అనుభవమే, త్యాగగుణమే ఈ నవల ఇతివృత్తం. కథను మాస్కోలో జరిగిన సమావేశంలో పాల్గొని తన వ్యవసాయ క్షేత్రానికి తిరిగి వెళుతున్న యువకుడు ఛాలికోవ్ తన వ్యవసాయ క్షేత్రంలో అనుభవాలను సాటి ప్రయాణికుడు, రచయితకు వివరిస్తూంటే ఆ రచయిత కుతూహలంగా వింటాడు. వ్యవసాయ కళాశాలలో చదివి స్వచ్ఛందంగా అక్కడికి వ్యవసాయ విషయాలలో సలహాలు ఇవ్వడానికి వచ్చిన యువతి నాస్త్యాను(నాస్త ష్యా వాహి త్యేవ్యా కో.ష్ షోవా) ఆరంభంలో తాము తేలికగా తీసుకుని ఆమె సలహాలు పెడచెవిన పెట్టినట్లు , ఆవిడ నిర్వికారంగా, దీక్షగా తన లక్ష్యాలను వివరించి, సాటి శ్రామికుల హృదయాలను జయించి, ప్రణాళికను విజయవంతంగా అమలు చేసి అన్ని వ్యవసాయ క్షేత్రాలకు ఆదర్శంగా నిలిచినదీ ఉత్సాహంగా వివరిస్తాడు ఛాలికోవ్.

కొత్తగా వచ్చిన నాస్త్యా మొదట ఎక్కువగా మాట్లాడేది కాదు. కళ్ళతోనే వింటున్నట్లుండేది. కొద్దికాలం అట్లా విన్న తరువాత ఆమె మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి ఆమె చేసే సూచనలు మిగతా వారికి నవ్వూ, కోపం, చికాకు తెప్పించేవి. మొదట ట్రాక్టర్లు బాగు చేసే కార్ఖానా సవ్యంగా లేదని చెబుతుంది. ‘నేను చదివిన స్కూళ్ళలో ఈ పోటీల గురించి ఎక్కడా చెప్పలేదే?’ అనివ్యాఖ్య చ్చేస్తుంది. ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నసమయంలో ‘మళ్ళ వ్యవసాయ పద్దతి’ నేర్చుకొనేందుకు మనుషులను పంపాలని పట్టు పడుతుంది. ఆ క్షేత్రంలో కీలకమైన యిద్దరు వ్యక్తులను ఆమే ఒప్పించి పంపుతుంది. విత్తనాలు చల్లి, ఆకుల మళ్ళు పోసే కాలంలో క్లోనర్ గడ్డికి బదులు జొన్న, పొద్దు తిరుగుడుపూల చెట్లు వేయాలని సూచిస్తుంది . మాటి మాటికి జిల్లా కమిటీకి ఫిర్యాదు చేస్తుంది.

ఈక్రమంలో ఆయువతి నాస్త్యా ఉన్నత వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు స్వయం వ్యక్తమవుతాయి. ఆ యువకుడు ఆమెపట్ల ఆకర్షితుడవుతాడు. వేకువన ఛా‌లికోవ్ దిగవలసిన స్టేషన్ వస్తుంది. స్టేషన్ లో అతని సహచరులు, ఆయువతి అందరూ కుతూహలంగా అతనికి స్వాగతం చెప్పేదృశ్యాన్ని రచయిత రైలు కిటికీనుంచే గమనిస్తాడు. తనతో ప్రయాణించిన అపరిచితుడు ఛాలికోవ్ పేరుపేరునా వర్ణించిన తన మిత్రులందరినీ, వాళ్ళమధ్య ఉన్న కథానాయిక నాస్త్యాను రచయిత గుర్తించగలుగుతాడు. రైలు కదలిపోతుంది. ఇదీ అపరిచితుడు నవల కథ.

మూలాలు

మార్చు
  1. "Amazon.co.uk". www.amazon.co.uk. Retrieved 2024-06-14.
  2. "The Newcomer". Goodreads (in ఇంగ్లీష్). Retrieved 2024-06-14.
  • అపరిచిత (రష్యన్ నవల), రచయిత్రి గెలీనా నికోలయేవా, తెలుగుసేత: అట్లూరి పిచ్చేశ్వరరావు, విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ, ప్రచురణ సంఖ్య నెం 340, ఆగస్టు, 1959.