అపోస్తలుల విశ్వాస ప్రమాణం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మొదటి అంశం (సృష్టిని గురించి)
అపోస్తలుల విశ్వాస ప్రమాణం - ఆచార్య మార్టిన్ లూథర్ వివరణ
అత్యంత సులభమైన పద్ధతిలో ఇంటి యజమాని తన ఇంట్లోవాళ్ళందరికీ నేర్పించాల్సింది.
భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను
దీని కర్థ మేమి?
నన్ను, సమస్త జీవరాశుల్ని దేవుడే కలుగజేశాడని, నాకు శరీరాన్ని, ఆత్మను, కళ్ళను, చెవుల్ని ఇంకా అవయువాలన్నింటినీ బుద్ధినీ, జ్ఞానేంద్రియాల్ని ఆయనే ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇంకా నేను బ్రతకడానికి కావాల్సినవన్నీ - అంటే వస్త్రాలు, అన్నపానాలు, ఇల్లు, ఆస్తి, భార్యపిల్లలు, భూమి, పశువులు మొదలైనవన్నీ నా కిచ్చి, ప్రతీ రోజూ దేవుడు నా అవసరాలు తీరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను.
ఇంకా దేవుడు నన్ను అన్ని అపాయాలనుండి తప్పిస్తూ, కీడంతటినుండి కాపాడి, సం రక్షిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా నా మంచితనం వల్లగాని, నేను చేసిన పుణ్యకార్యాల వల్లగాని, నా కున్న యోగ్యతనుబట్టిగాని కాక, తండ్రి భావం కలిగిన దేవుడు, కేవలం తన ప్రేమనుబట్టి, కృపనుబట్టి నాకిస్తున్నాడని నేను నమ్ముతున్నాను.
ఆయన నా కిచ్చిన సమస్తాన్నిబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, ఆయనకు లోబడి, సేవించడానికి కట్టుబడి ఉంటానని నమ్ముతున్నాను.
కచ్చితంగా ఇదే నిజం!
రెండో అంశం (విమోచన గురించి)
ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి, కన్యయైన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడెననియు, అదృశ్య లోకములోనికి దిగెననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి, పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియైన దేవుని కుడిచేతివైపున కూర్చుండి యున్నాడనియు, సజీవులకును మ్రుతులకును తీర్పు చేయుటకు అక్కడనుండి వచ్చుననియు నమ్ముచున్నాను.
దీని కర్థ మేమి?
నిత్యత్వంలోంచి తండ్రి నుండి కలిగిన నిజమైన దేవుడు, కన్య మరియ గర్భం నుండి పుట్టిన నిజమైన మానవుడు అయిన యేసు క్రీస్తు నా ప్రభువని నేను నమ్ముతున్నాను.
దారి తొలిగిపోయి, శిక్ష పొందాల్సిన నన్ను ఆయన విమోచించాడు. సమస్త పాపములనుండి, చావు నుండి, సైతాను శక్తి నుండి నన్ను గెల్చుకున్నాడు. వెండి బంగారములతో కాక అమూల్యమైన, పవిత్రమైన తన రక్తంతో, నిరపరాధి అయిన తాను నా కోసం పడ్డ శ్రమ, మరణాల ద్వారా నన్ను కొనుక్కున్నాడు. నేను తన వానిగా ఉండాలని ఆయన ఇదంతా చేశాడు. ఆయన పరిపాలనలో, ఆయన రాజ్యంలో ఉంటూ నిత్యమైన నీతితో నిరంతరం ఆయన్ని కొలిచేందుకు, పాపమన్నదే లేకుండా ధన్యకరమైన ఆ జీవితంలో నేను ఆనందించాలని ఇదంతా చేశాడు. ఆయన ఎలా మరణాన్ని జయించి తిరిగిలేచి నిరంతరం పరిపాలిస్తున్నాడో అలాగే నేను కూడా ఆయనలా మరణాన్ని జయించి, తిరిగిలేచి ఆయంతో కూడా పరిపాలించాలని కోరుకొంటున్నాడు.
కచ్చితంగా ఇదే నిజం!
మూడో అంశం (పవిత్రపర్చ బడటం గురించి)
పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్!
దీని కర్థ మేమి?
నా స్వంత ఆలోచనతో గాని, స్వంత శక్తివల్ల గాని, స్వంత బుద్ధిచేత గాని యేసు క్రీస్తు నా ప్రభువని నేను నమ్మలేను, ఆయన దగ్గరకు చేరలేను అని నేను నమ్ముతున్నాను. అయితే పరిశుద్ధాత్ముడే సువార్త ద్వారా నన్ను పిలిచి, తన యీవులతో నన్ను వెలిగించి, పరిశుద్ధపర్చి నిజమైన విశ్వాసంలో నన్ను నిల్పుతున్నాడు. ఇదే విధంగా ఆయన భూమ్మీదున్న క్రైస్తవ సంఘమంతటినీ పిల్చి, సమకూర్చి, వెలిగించి, పవిత్రపర్చి ఒకే నిజ విశ్వాసంలో క్రీస్తునందు కాపాడుతున్నాడు. ఈ క్రైస్తవ సంఘంలో ప్రతీ రోజూ నా పాపములను, విశ్వాసులందరి పాపములను పూర్తిగా క్షమిస్తున్నాడు. కడవరి దినాన ఆయన నన్ను చావునుండి లేపుతాడు. ప్రజలందర్నీ లేపుతాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన నాకు, అలాగే విశ్వాసుల గుంపుకు ఆయన నిత్యజీవాన్నిస్తాడు.
కచ్చితంగా ఇదే నిజం!