అఫ్తాబ్ అహ్మద్ ఖాన్
అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ 1963 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఐ.పి.ఎస్ అధికారి, మాజీ రాజకీయ నాయకుడు. ఆయన1990లో దేశంలో ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా తొలిసారిగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు.
అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ | |
---|---|
జననం | 27 ఫిబ్రవరి 1941 |
మరణం | 2022 జనవరి 21 | (వయసు 80)
జాతీయత | భారతదేశం |
ఇతర పేర్లు | ఎ.ఎ. ఖాన్ |
వృత్తి |
|
ఉద్యోగం | ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐ.పి.ఎస్ అధికారి) |
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ |
వృత్తి జీవితం
మార్చుఅఫ్తాబ్ అహ్మద్ ఖాన్ 1990లో దేశంలో ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా తొలిసారిగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌ను (ఏటీఎస్) స్థాపించి, వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు. అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ 1991 జనవరి 24న గుజరాత్‌లోని వడోదరాలో చేపట్టిన 'ఆపరేషన్ బరోడా' ఎన్‌కౌంటర్‌తో ఖలీస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ బల్దియో సింగ్ సైనీ, మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 1992లో ముంబైలోని ములుంద్ ప్రాంతంలో చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. హర్యానా సీఎంపై కాల్పులు జరిపిన ఉగ్రవాది మన్‌జిత్ సింగ్‌ను ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఖాన్ టీమ్ అరెస్ట్ చేసింది. ముంబైలో కరుడుగట్టిన నేరస్థులు మాయా డోలాస్, దిలీప్ బువాలను లోఖండ్ వాలా కాంప్లెక్స్‌లోని స్వాతి భవనంలో ఖాన్ టీమ్ చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యారు. అఫ్తాబ్ అహ్మద్ ఖాన్ 1995లో మహారాష్ట్ర ఐజీగా సేవలందించిన అదే ఏడాది పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాదు.
మరణం
మార్చుఅఫ్తాబ్ అహ్మద్ ఖాన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న అనంతరం తలెత్తిన అనారోగ్య కారణాలతో అంధేరీలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స అందుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే అనారోగ్యంతో 2022 జనవరి 21న మరణించాడు.[1][2]
మూలాలు
మార్చు- ↑ Sakshi (23 January 2022). "నేరస్తుల పాలిట సింహస్వప్నం.. ఏఏ ఖాన్ కన్నుమూత". Sakshi. Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Zee News Telugu (23 January 2022). "గ్యాంగ్‌స్టర్స్‌ను గడగడలాడించిన లెజెండరీ ఐపీఎస్ ఏఏ ఖాన్ కన్నుమూత." Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.