అబూ అజ్మీ
అబూ అసిమ్ అజ్మీ (జననం 8 ఆగస్టు 1955) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
అబూ అసిమ్ అజ్మీ | |||
సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1995 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 అక్టోబర్ 13 | |||
ముందు | నియోజకవర్గం సృష్టించారు | ||
---|---|---|---|
నియోజకవర్గం | మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ | ||
పదవీ కాలం 2002 – 2008 | |||
నియోజకవర్గం | ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అజంగఢ్ , ఉత్తరప్రదేశ్ , భారతదేశం | 1955 ఆగస్టు 8||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
సంతానం | ఫర్హాన్ అజ్మీ (కొడుకు) | ||
నివాసం | బాంద్రా , ముంబై , మహారాష్ట్ర , భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅబూ అజ్మీ 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2004లో భివాండి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత 2002 నవంబర్ 26 నుండి 2008 నవంబర్ 25 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అబూ అజ్మీ 2014,[3] 2019,[4] 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Mankhurd Shivaji Nagar Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 29 December 2024. Retrieved 29 December 2024.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Mankhurd Shivaji Nagar". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.