అబ్బాదుల్లా తెలుగు రచయిత. ఆయన ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలో యువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో 'తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు.

బాల్యము

మార్చు

అబ్బాదుల్లా కడప జిల్లా కొమ్మర్ల కాల్వ గ్రామంలో 1937 నవంబరు 24న రసూల్‌బి, షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌లకు జన్మించారు. బిఎ (ఆనర్స్‌) చదివారు.

ఉద్యోగము

మార్చు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో చేరి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పనిచేశారు.

రచనా వ్యాసంగము

మార్చు

1976లో రచనా వ్యాసంగాన్ని ఆరంభించి 'ధర్మ సంస్థాపన' అనువాద గ్రంథాన్ని ప్రచురించారు. ఆ క్రమంలో 20కి పైగా ఉర్దూ ఆధ్యాత్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. 1992లో 'ఇస్లాం ప్రబోధిని' (నాలుగు సంపుటాలు) అనువాద గ్రంథంమంచి పేరు తెచ్చిపెట్టింది. ధార్మిక, సామాజిక అంశాల మీదా వ్యాసాలు రాశారు. 'తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌' సంస్థకు సంచాలకులుగా పది సంవత్సరాలు బాధ్యాతలు నిర్వహించారు. ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలో యువతకు అవకాశాలు కల్పించాలన్న లకక్ష్యంతో 'తెలుగు స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌' సంస్థను ఆరంభించి 2009 వరకు మార్గదర్శకం వహించారు. 'గీటురాయి' వారపత్రికను దినపత్రికగా తీర్చిదిద్దాలన్నసంకల్పంతో ప్రయత్నించారు.

మరణము

మార్చు

2009 సెప్టెంబర్‌ 27న అబ్బాదుల్లా హైదారబాద్‌లో కన్నుమూశారు.

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము. పుట 29, అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త—ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌

ఇతర లింకులు

మార్చు