అభిజిత్ సేన్ (ఆంగ్లం: Abhijit Sen) ప్రముఖ ఆర్థికవేత్త. ఆయన ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు. గ్రామీణ అర్థిక వ్యవస్థలో నిపుణుడిగా కూడా పేరు సంపాదించాడు. ఆయన అందించిన ప్రజా సేవకు గాను 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

అభిజిత్ సేన్
జననం1950
మరణం2022 ఆగస్టు 29
పౌరసత్వంభారతీయుడు
విద్యాసంస్థసెయింట్ స్టీఫెన్స్ కళాశాల
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
వృత్తిప్రొఫెసర్, ఆర్థికవేత్త

జీవిత చరిత్ర మార్చు

ఢిల్లీలోని బెంగాలీ కుటుంబంలో అభిజిత్ సేన్ జన్మించాడు. సర్దార్ పటేల్ విద్యాలయలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఫిజిక్స్ ఆనర్స్ డిగ్రీ అందుకున్నాడు. 1981లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసాడు. అక్కడ ఆయన ట్రినిటీ హాల్ సభ్యుడిగా ఉన్నాడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2004 నుంచి 2014 వరకు భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగా పదేళ్లు పని చేసాడు. ఈ భారత ప్రణాళికా సంఘం 2014లో రద్దయింది.

ఆర్థిక శాస్త్రంలో నాలుగు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన ఆయనన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం బోధించాడు.[1] అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని తొలి ఎన్‌డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ ఖర్చులు, ధరల(CACP) కమిషన్‌కి చైర్మన్‌గా అభిజిత్ సేన్ వ్యవహరించాడు. అలాగే ఆయన అనేక ముఖ్యమైన ప్రభుత్వ పదవులను కూడా నిర్వహించాడు.

మరణం మార్చు

72 ఏళ్ళ అభిజిత్ సేన్ 2022 ఆగస్టు 29న ఢిల్లీలో గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.[2] ఆయనకు భార్య జయంతి ఘోష్, కూతురు జాహ్నవి ఉన్నారు. జయంతి ఘోష్ కూడా ప్రముఖ ఆర్థిక వేత్త,

మూలాలు మార్చు

  1. "Planning Commission, Government of India". Archived from the original on 20 January 2013. Retrieved 2 January 2013.
  2. "agriculture economist abhijit sen, Abhijit Sen: ప్రముఖ ఆర్థిక వేత్త అభిజిత్ సేన్ కన్నుమూత - economist abhijit sen passes away - Samayam Telugu". web.archive.org. 2022-08-30. Archived from the original on 2022-08-30. Retrieved 2022-08-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)