అభిరుచి

(అభిరుచులు నుండి దారిమార్పు చెందింది)

ఈ రోజుల్లో మనిషి జీవితం అంతా యాంత్రికం అయిపోయింది. ఎవరికి వారు తమ తమ రోజువారీ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ పనుల తర్వాత దొరికే ఖాళీ సమయాల్లో మనమంతా మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం. ఈ ఖాళీ సమయంలో చేసే పనినే అభిరుచి అని అంటారు. దీనినే ఆంగ్లంలో Hobby/Interest అని అంటారు.

ఉదాహరణలు: పాటలు వినడం, సినిమాలు చూడటం, బొమ్మలు గీయటం, ఇంటర్నెట్ చూడటం, యోగా చేయడం, నీటిలో ఈదటం, నడవటం వంటివి.

ఇవి అందరికీ మామూలుగా ఉండే అభిరుచులుగా చూడచ్చు.

ఇంకా కొంతమందికి కొన్ని వినూత్నమైన అభిరుచులు ఉంటాయి. ఉదాహరణలు: తపాలా బిళ్ళల సేకరణ, వివిధ దేశాల నాణేల సేకరణ, ఎత్తైన కొండలు ఎక్కడం వంటివి.

ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని అభిరుచులు ఉండటం చాలా అవసరం. దీనివల్ల మన రోజువారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొదవచ్చు. అలా సరదాగా గడపటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తొందరగా అలసిపోకుండా ఉండవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=అభిరుచి&oldid=1290880" నుండి వెలికితీశారు