మూస:Infobox art movementఅమరావతి కళాశైలి, పురాతన భారతీయ కళా శైలి. ఇది ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో (అప్పుడు దీనిని ధాన్యకటకం అనేవారు) సా.పూ. 2వ శతాబ్దం నుండి సా.శ. 3వ శతాబ్దం చివరి వరకు విలసిల్లింది.[1][2][3] దీనిని ఆంధ్ర శైలి లేదా వేంగి శైలి అని కూడా అంటారు.[2] కళా చరిత్రకారులు అమరావతి కళను పురాతన భారతీయ కళ లోని మూడు ప్రధాన శైలులలో ఒకటిగా భావిస్తారు, మిగిలిన రెండు మధుర శైలి, గాంధారన్ శైలి.[4][5]

అమరావతిలోని శిథిలాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట, నాగార్జునకొండ, ఘంటసాల, గోలి పశ్చిమాన మహారాష్ట్రలోని టెర్ వరకు ఉన్న స్థూపావశేషాలలో కూడా ఈ శైలి కనిపిస్తుంది. తూర్పు భారత తీరం నుండి ఉన్న సముద్ర వర్తక సంబంధాల కారణంగా, అమరావతి శిల్పకళా శైలి దక్షిణ భారతదేశం, శ్రీలంక (అనురాధపురలో చూసినట్లుగా), ఆగ్నేయాసియాలలో శిల్ప కళపై గొప్ప ప్రభావాన్ని చూపింది.[6][1][2][5][7]

లక్షణాలు

మార్చు

వివిధ బౌద్ధ దేశాలలోని చిత్రాల నమూనాగా మారిన శిల్పాలలో బుద్ధ చిత్రం ఇక్కడ ప్రమాణీకరించబడింది.[5] 12వ శతాబ్దం వరకు శ్రీలంకలో అమరావతి శైలి బుద్ధుని విగ్రహం దాని ప్రజాదరణను నిలుపుకుంది.[8]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Amarāvatī sculpture". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 25 March 2023.
  2. 2.0 2.1 2.2 V. D., Mahajan (2016). Ancient India (in ఇంగ్లీష్). S. Chand Publishing. pp. 294, 295. ISBN 978-93-5253-132-5.
  3. Kumari, Sabita (2012). "Representation of the Birth of the Buddha in Buddhist Art of Andhradesa".
  4. Pal, Pratapaditya (1986). Indian Sculpture: Circa 500 B.C.-A.D. 700 (in ఇంగ్లీష్). Los Angeles County Museum of Art. p. 154. ISBN 978-0-520-05991-7.
  5. 5.0 5.1 5.2 Jermsawatdi, Promsak (1979). Thai Art with Indian Influences (in ఇంగ్లీష్). Abhinav Publications. pp. 48, 49. ISBN 978-81-7017-090-7.
  6. Rowland 1967
  7. Chowdhuri, Sreyashi Ray (24 October 2022). "Impact of Amarāvatī on early schools of art of South-East Asia" (in ఇంగ్లీష్). University of Calcutta. Retrieved 27 March 2023 – via Wisdom Library.
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు