అమృత రావు (మ .1770 - 1824) మరాఠా ప్రముఖుడు. పేష్వా రఘునాథ రావు దత్తపుత్రుడు. 1803 లో యశ్వంత రావు హోల్కరు పూనా మీద దాడి చేసి తన పెంపుడు సోదరుడు పేష్వా రెండవ బాజీ రావును పదవీచ్యుతుడిని చేసాడు. తదనంతరం హోల్కరు నామమాత్రంగా అమృత రావు నేతృత్వంలో ఒక తాత్కాలిక మండలిని ఏర్పాటు చేసి పేష్వా ప్రభుత్వాన్ని తన పేరు మీద నడిపించాడు. హోల్కరు తన ప్రభుత్వం చట్టపరమైన స్థితిని బలోపేతం చేయడానికి అమృతరావు కుమారుడు వినాయక రావును పేష్వాగా నియమించాడు. ఎందుకంటే మరణించిన పేష్వా రెండవ మాధవ రావు వితంతుభార్య వినాయకను దత్తత తీసుకున్నది. ఏదేమైనా బాజీ రావు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ నుండి సహాయం కోరాడు. ఆయన పురోగతితో అమృత రావు ఆయన కుమారుడు పూణే నుండి పారిపోవాలని ఒత్తిడి చేయబడ్డారు. తదనంతరం అమృత రావు బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. బుందేల్ఖండులోని పెన్షను ఎస్టేటును తీసుకుని ప్రతిఫలంగా పేష్వా కార్యాలయం మీద ఉన్న అన్ని హక్కులను వదులుకోవడానికి అంగీకరించాడు.

Amrut Rao
జననంc. 1770
మరణం1824
ఇతర పేర్లుAmrit Rao, Amritrao, Amrutrao, Amritrav, Amrut Row
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Titular prime minister of the Maratha confederacy in 1803
పిల్లలుVinayak Rao
తల్లిదండ్రులుRaghunath Rao (adoptive)

ఆరంభకాల జీవితం మార్చు

1775 లో బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీతో పొత్తు పెట్టుకున్న మరాఠా పేష్వా రఘునాథ రావు చేత స్వీకరించబడింది. అయినప్పటికీ బ్రిటిషు వారు తరువాత సల్బాయి ఒప్పందం మీద (1782) మరాఠాలలో రఘునాథ ప్రత్యర్థులతో సంతకం చేశి మాధవ రావును పేష్వాగా అంగీకరించారు. రఘునాథ రావు 1783 లో ఒక సంవత్సరం తరువాత మరణించాడు. ఆయన కుటుంబాన్ని పేష్వా మంత్రి నానా ఫడ్నవీలు నిర్బంధంలో ఉంచారు. ఆయన భార్య ఆనందీ బాయి, అతని కుమారులు రెండవ బాజీ రావు, రెండవ చిమాజీ రావు, ఆయన దత్తపుత్రుడు అమృత రావు అందరూ 1793 వరకు కోపర్గావులో ఖైదు చేయబడ్డారు. తదనంతరం వారిని ఆనంద్వాలికి (నాసికులో) తరలించారు. 1794 ఏప్రెలులో గృహనిర్భంధానికి పరిమితం అయ్యారు. శివనేరి కోటకు. పేష్వా రెండవ మాధవరావు మరణం తరువాత నానా ఫడ్నవిసు, శక్తివంతమైన కులీనుడు దౌలతు రావు సింధియా అమృత రావు పెంపుడు సోదరులను - మొదట చిమాజీ రావు, తరువాత రెండవ బాజీ రావు - పేష్వాలు అని పేరు పెట్టారు.[1] ఫడ్నవీల మరణం తరువాత రెండవ బాజీ రావు తోలుబొమ్మ పేష్వాగా నియమితుడిని చేసి దౌలతు రావు సింధియా అసలు శక్తిగా వెనుక ఉండి నడించాడు.[2]

దౌలతురావు సింధియాతో సంఘర్షణ మార్చు

దౌలతు రావు సింధియా ముందున్న మహాద్జీ సింధియా వితంతుభార్య సింధియా రాజసభ నియంత్రణ కోరుతూ అతనితో పోరాడింది. [3] 1798 లో సింధియా వితంతుభార్యను అహ్మదు నగరుకు బదిలీ చేసి, వారిని అక్కడ గృహనిర్బంధంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ సింధియా మనుషులు అహ్మదునగరుకు తరలిస్తుండగా, మహిళలకు విధేయుడైన అధికారి ముజాఫరు ఖాను వారిని కోరెగావు భీమా సమీపంలో రక్షించాడు. ఖాను వితంతువులను కొరెగావు భీమా దగ్గర ఉన్న అమృత రావు వద్దకు తీసుకువెళ్ళాడు. అమృత రావు వారికి రక్షణ కల్పించారు.[4]

1798 జూన్ 7 రాత్రి వితంతువులను తిరిగి పొందటానికి సింధియా ఒక ఫ్రెంచి అధికారి - కెప్టెను డు ప్రాటు ఆధ్వర్యంలో ఐదు పదాతిదళ బెటాలియన్లను పంపాడు. అయితే అమృత రావు సైన్యం సింధియా మనుషులను వెనక్కి నెట్టాలని బలవంతం చేసింది. సింధియా అప్పుడు చర్చలు ప్రారంభించి మహిళలు వారి నివాసం ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చింది. మహిళల తరపున సింధియాను కలవడానికి అమృత రావు పూనాను చేరుకున్నాడు. ఆయన తన శిబిరాన్ని ములా నది ఒడ్డున, ఖాడ్కి వంతెన సమీపంలో ఏర్పాటు చేశాడు. స్థానిక మొహర్రం ఊరేగింపులో క్రమాన్ని కొనసాగించాలనే నెపంతో సింధియా బావ, జనరలు సర్జీ రావు ఘట్గే (సర్జెరావు అని కూడా పిలుస్తారు) రెండు బెటాలియన్లను నదీతీరానికి నడిపించారు. కానీ ఆయన వ్యక్తులు 25 ఫిరంగులతో అమృత రావు శిబిరంలో కాల్పులు జరిపారు. అమృత రావు దళాలు చెదరగొట్టబడడంతో ఘాట్గే శక్తి వారి మీద దాడి చేసి వారి శిబిరాన్ని దోచుకుంది. ఆ తరువాత వితంతువులు కొల్హాపూరుకు పారిపోయారు.[4]

పూనాను హోల్కర్లు ఆక్రమించుట మార్చు

1802 అక్టోబరు 25 న దౌలతు రావు సింధియా ప్రత్యర్థి ప్రముఖుడు యశ్వంతు రావు హోల్కరు పూనా మీద దండెత్తి, హదప్సరు యుద్ధంలో సింధియా, పేష్వా రెండవ బాజీ రావు సంయుక్త దళాలను ఓడించారు.[2] పూణే మీద నియంత్రణ సాధించిన తరువాత హోల్కరు పూనాలో పేష్వా హోదా పొందాలని నిర్ణయించుకున్నాడు. అసలు అధికారాన్ని పేష్వా కార్యాలయం కలిగి ఉండకపోగా పేష్వాను తొలగించే చర్య ఇతర మరాఠా ప్రభువుల వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. అందువలన జున్నారులో ఉన్న బాజీ రావు సోదరుడు అమృత రావును హోల్కరు పంపాడు. రెండవ బాజీ రావు పూర్వీకుడు పేష్వా రెండవ మాధవ్ రావు భార్య అయిన యశోద బాయి దత్తత తీసుకున్న అమృత రావు తన కుమారుడు వినాయక రావుతో పూనా చేరుకున్నారు.[5] హోల్కరు అమృత రావు నేతృత్వంలో ఒక తాత్కాలిక మండలిని ఏర్పాటు చేసి ఆయన పేరు మీద పేష్వా ప్రభుత్వాన్ని నడిపించాడు.[6] వినాయక రావును కొత్త పేష్వాగా నియమించడం ద్వారా పూనాలోని తన కొత్త ప్రభుత్వానికి చట్టపరమైన హోదా ఇవ్వడానికి కూడా ప్రయత్నించాడు.[5]

1803 మార్చి 13 న హోల్కరు పూణే నుండి బయలుదేరాడు. అమృత రావును 1,000 మంది సైనికుల రక్షణలో విడిచిపెట్టాడు. [7] ఇంతలో రెండవ బాజీ రావు వాసాయికి పారిపోయాడు. బ్రిటిషు వారి సహాయం తీసుకున్నాడు. యశ్వంతు రావు హోల్కరు, అమృత రావు తమ ప్రభుత్వానికి బ్రిటిషు మద్దతు పొందడంలో విఫలమయ్యారు.[6] 1802 డిసెంబరు 31 న బ్రిటీషు వారు బాజీ రావుతో బస్సేను ఒప్పందం మీద సంతకం చేశారు. 1803 లో బ్రిటిషు వారు ఆర్థరు వెల్లెస్లీ నేతృత్వంలోని సైన్యాన్ని పూణేను స్వాధీనం చేసుకుని, రెండవ బాజీ రావును బ్రిటిషు అధికారం క్రింద పేష్వాగా పనిచేయడానికి పంపించారు. అమృత రావు హోల్కరు మనుషులతో పూణే నుండి పారిపోవలసి వచ్చింది. వెల్లెస్లీ పూనా వైపుకు వెళుతుండగా అమృత రావు నగరాన్ని దోచుకున్నాడని హోల్కరు తన సైనికాధికారికి నగరాన్ని విడిచిపెట్టే ముందు నగరాన్ని దహనం చేయమని ఆదేశించాడని అతనికి వార్తలు వచ్చాయి. ఏదేమైనా 1803 ఏప్రిలు 20 న ఆయన నగరానికి చేరుకునే సమయానికి నగరం సురక్షితంగా ఉందని ఆయన కనుగొన్నాడు.[2] బ్రిటిషు వారు రెండవ బాజీ రావును 1803 మే 13 న తిరిగి పేష్వాగా నియమించబడ్డాడు. ఈసారి బ్రిటిషు నియంత్రణలో ఉన్నారు.

పూనాకు పారిపోయిన తరువాత మార్చు

హోల్కరు తన ఐరోపా అధికారి విలియం లిన్నియసు గార్డనరును అమృత రావు శిబిరంలో అనుసంధాన అధికారిగా (వాస్తవానికి గూఢాచారి) విడిచిపెట్టాడు. పూనా నుండి బలవంతంగా పారిపోయిన తరువాత అమృత రావును హోల్కరు మోసం చేసాడని గ్రహించాడు. ఆయన శక్తివంతమైన బ్రిటిషు వారికి వ్యతిరేకంగా ఒక చిన్న సైనికశక్తితో తనను విడిచిపెట్టి ఫోల్కరు తనను మోసం చేసాడని భావించాడు. ఫలితంగా అమృత రావు గార్డనరును జైలులో పెట్టారు. తదనంతరం ఆయన గార్డనరును పిలిపించి ఇద్దరూ హోల్కరు ప్రత్యర్థి సిండాతో చేరాలని సూచించాడు. గార్డనరు అమృత రావు సైనికులకు శిక్షకుడిగా పనిచేశాడు. అమృత రావుకు కోపం తెప్పించిన ఈ ప్రతిపాదనను గార్డనరు నవ్వాడు. ఒకానొక సమయంలో అమృత రావు సైనికులు ఆయనను ఫిరంగి మూతికి బంధించారు. అయినప్పటికీ వారు ఆయనను ఖైదు చేయలేదు. ఎందుకంటే ఆయన విలువైన ఖైదీ: హోల్కరు ఉత్తమ అధికారులలో ఒకరిగా, ఆయనను అమృతరావు సింధియాకు అప్పగించబడవచ్చునని భావించి అమృత రావు సింధియాను కలవడానికి వెళుతుండగా, గార్డనరు అమృతరావు అదుపు నుండి తప్పించుకోగలిగాడు.[7]

ఇంతలో బ్రిటిషు జనరలు ఆర్థరు వెల్లెస్లీ అమృత రావుతో కరస్పాండెన్సు ప్రారంభించారు. వెల్లెస్లీ ఆయనను ఒక విలువైన మిత్రుడిగా చూశాడు. ఆయన విరోధిగా ఉంటే ప్రమాదకరమైన ప్రత్యర్థిగా మారగలడు. అమృత రావు అయిష్టంగానే హోల్కరుతో చేరాడు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడటంలో పెద్దగా అవగాహన లేదు. పర్యవసానంగా రెండు పార్టీలు చర్చలు జరపాలని నిర్ణయించుకున్నాయి. అయినప్పటికీ రెండవ భాజీరావు రాజీతో సంతోషంగా లేడు. పేష్వా రెండవ బాజీ రావు అమృత రావును తన శత్రువుగా భావించాడు.[2] 1803 ఆగస్టు 14 న అమృత రావు బ్రిటిషు వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పేష్వా కార్యాలయం మీద ఉన్న అన్ని వాదనలను వదలివేయడానికి, బ్రిటిషు వారితో స్నేహంగా ఉండటానికి ఆయన అంగీకరించాడు. ప్రతిగా ఆయన బండా జిల్లాలో ఒక జాగీర్తో కంపెనీ నుండి సంవత్సరానికి 7 లక్షల రూపాయల పెన్షను పొందాడు. ఆయన కార్విలో తన నివాసం చేపట్టాడు. ఆయన, ఆయన వారసులు బుందేల్ఖండు ఏజెన్సీ తిరోహా (కిరూరు) ఎస్టేటును పరిపాలించారు.[8] అక్కడ, అతను తన మతతత్వం, దాతృత్వానికి ప్రసిద్ది చెందాడు.[9] ఆయన ఒకసారి బెనారసులో ఖైదు చేయబడిన వ్యక్తులందరినీ అప్పులు తీర్చడం ద్వారా విడిపించాడు.[10]


అమృత రావు 1824 సెప్టెంబరు 6 న బెనారసు సమీపంలోని సెక్రోలు వద్ద మరణించాడు.[9][11]ఆయన కుమారుడు, వారసుడు వినాయక రావు 1853 లో సంతానం లేకుండా మరణించాడు. కంపెనీ వారి పెన్షను నిలిపివేసిన తరువాత వినాయకు దత్తపుత్రులు నారాయణ, మాధో 1857 తిరుగుబాటులో చేరారు. తిరుగుబాటు అణిచివేయబడింది: నారాయణరావు ఖైదీగా మరణించాడు. తిరుగుబాటు సమయంలో ఆయన చిన్న వయస్సును పరిగణనలోకి తీసుకుని మాధో రావుకు పాలెగాడుగా ఉండటానికి అనుమతి ఇవ్వబడింది.[8]

మూలాలు మార్చు

  1. The Asiatic Journal and Monthly Register for British and Foreign India, China, and Australia, Volume 10. Parbury, Allen, and Company. 1833. p. 22.
  2. 2.0 2.1 2.2 2.3 Rory Muir (2013). Wellington: The Path to Victory 1769-1814. Yale University Press. pp. 107–125. ISBN 9780300186659.
  3. R.S. Chaurasia (2004). History of the Marathas. Atlantic. pp. 39–40. ISBN 9788126903948.
  4. 4.0 4.1 James Grant Duff (1826). "Chapter IX – From 1798 to 1800". A History of the Mahrattas. Vol. III. pp. 162–179.
  5. 5.0 5.1 Jaswant Lal Mehta (2005). Advanced Study in the History of Modern India 1707-1813. Sterling. p. 618. ISBN 9781932705546.
  6. 6.0 6.1 Arthur Wellesley Duke of Wellington (1877). A Selection from the Despatches, Treaties, and Other Papers of the Marquess Wellesley, K.G., During His Government of India. Clarendon. p. 218.
  7. 7.0 7.1 Narindar Saroop (1983). Gardner of Gardner's Horse, 2nd Lancers, Indian Army. Palit & Palit Abhinav. pp. 40–43.
  8. 8.0 8.1 Charles Umpherston Aitchison (1892). A Collection of Treaties, Engagements, and Sunnuds, Relating to India and Neighbouring Countries. Vol. IV (Containing the Treaties, Etc, Relating to the Central India Agency). Calcutta: Office of the Superintendent of Government Printing.
  9. 9.0 9.1 Reginald Heber (1843). Narrative of a journey through the upper provinces of India from Calcutta to Bombay: 1824-1825. Murray. p. 163.
  10. The Church Missionary Juvenile Instructor. Seeley, Jackson, & Halliday. 1879. p. 69.
  11. "Death of Amrut Rao at Benares on 6 Sep 1824". The National Archives. Retrieved 29 December 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=అమృతరావు&oldid=3387344" నుండి వెలికితీశారు