అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అనే ప్రొఫెషనల్ సంస్థ, 1880లో స్థాపించబడి మెకానికల్ ఇంజనీరింగ్, తత్సంబంధిత రంగాలలో పరిశోధనలు చేయుట, అవగాహన కృషి చేయుట, ప్రమాణాలనేర్పరచుట వంటి ఆశయాలు కలిగియున్నది. మొదట్లో ఉత్తర అమెరికాకే పరిమితమైన ఈ సంస్థ, తర్వాతర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సంస్థ నిర్మించిన ప్రమాణాలనే దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలూ వాడుతున్నాయి.

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ 19 శతాబ్దం నాటి ప్రధాన కార్యాలయం

చరిత్ర

మార్చు

ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ASME గ్లోబల్ ఇంజనీరింగ్ సమాజమునకు (కమ్యూనిటీ) సహాయపడుతుంది. 1880 లో స్థాపించ బడిన అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ASME) ఒక లాభాపేక్షలేని వృత్తి సంబంధమైన( ప్రొఫెషనల్) సంస్థ. సమాజంలో ఇంజనీయర్ల పాత్రను ప్రోత్సహిస్తూ, అన్ని ఇంజనీరింగ్ విభాగాలలో సహకారం, జ్ఞానం పంచుకోవడం, నైపుణ్య అభివృద్ధి ఈ సంస్థ మొదటి ప్రధాన్యం , లక్ష్యం . అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ( ASME) వారి సంకేతాలు( codes) ,ప్రమాణాలు ( standards), ప్రచురణలు, సమావేశాలు, నిరంతర విద్య, వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు సాంకేతిక పరిజ్ఞానం తొ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడానికి ఒక పునాదిని అందిస్తాయి.

సభ్యులుగా చేర్చుకోవడం

మార్చు

ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచములో ఒక స్థానమును నిలబెట్టుకోవడం, ఇంజనీరింగ్ శాస్త్ర , సాంకేతిక పరిజ్ఞానము అందిచడములో అంతర్భాగముగా ప్రభుత్వం, విద్యాసంస్థలు , పరిశ్రమలు , ఇంజనీర్లు, విద్యార్థులు, సాంకేతిక అభివృద్ధి నిపుణులను నిమగ్నం చేసే విధంగా ప్రజా ప్రయోజనంలో కీలక సాంకేతిక సంబంధిత సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడడం , ఇందులో భాగము గా ప్రపంచములో వృత్తి సంభందిత సభ్యులను, విద్యార్థులకు చందా దారులుగా ఉండే విధముగా ప్రోత్సహించడం తద్వారా వారు తమ ఆలోచనలను పంచుకోవడం , విషయపరిజ్ఞానమును అందిచడం, వివిధ ప్రాజెక్టులలో భాగస్వామ్యము కావడం, తమ రచనలను ప్రచురణ చేయడం , వీటితో మానవ మేధస్సుకు నైపుణ్యత ప్రపంచ వ్యాప్తముగా అందరికి చేరవేయడం వంటి ఉద్దేశ్యములను కలిగి ఉన్న సంస్థ . అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్( ASME) సంస్థకు ప్రపంచ వ్యాప్తముగా 1,00,000 ( లక్షకు ) పై బడి సభ్యత్వసంఖ్య , 140 దేశాలు సంస్థలో సభ్యత్వము కలిగి ఉండటం , సంవత్సరములో 25 సమావేశాలు ( conferences) చేయడం , 200 పైగా సాంకేతిక కోర్స్ లు అందిస్తున్నది.[1]

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ASME ఇంటర్నేషనల్) స్థాపన నుండి ప్రమాణాలపై చర్చలు జరిగాయి అవి డ్రాయింగ్ చిహ్నాలు, లైన్ షాఫ్టింగ్,మెషిన్ స్క్రూలు, డ్రాయింగ్ బోర్డులు.పెరుగుతున్న పారిశ్రామికీకరణతో, పరస్పర మార్పిడి లేకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. ఒక ప్రామాణికత అవసరాన్ని ఇంజనీర్లు గ్రహించి ,సురక్షితంగా ఉండే ప్రమాణాలు , కొలతలపై 1883 లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్ష కోడ్ 1884 లో ప్రచురించబడింది అది ASME యొక్క మొదటి ప్రమాణంగా మారింది. ఈ కోడ్ ( మార్గదర్శిని ) లో పైపులు, పైపు దారాలను సొసైటీ నిర్ణయించింది ఇవి ప్రామాణికంగా ఉండాలి , ప్రమాణాలు ఉండాలి. పైపు "పైపు తయారీదారులు , పైపు వినియోగదారుల ప్రతినిధులతో" ఉండాలి. ప్రామాణికతను సాంకేతికను నిర్వచిస్తే ఇవి ఒక మార్గదర్శకాల సమితిగా నిర్వచించవచ్చు- ఈ ప్రమాణాలను స్వచ్ఛందంగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి.[2]

అనుభంద సంస్థ

అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ ఇంజనీర్స్ (ISIE) LLC ను ఏర్పాటు చేసింది. ఇది గృహ వ్యాపార సంస్థలకు లాభదాయక అనుబంధ సంస్థ, కొత్త , వినూత్న ఉత్పత్తులు, సేవలను , సాంకేతికతలను ఇంజనీరింగ్ రంగములో తీసుకురావడం దీని ఉద్దశ్యం.[3]

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "About ASME". www.asme.org (in ఇంగ్లీష్). Retrieved 2021-02-04.
  2. STANDARDS, ASME CODES (6 February 2021). "INTRODUCTION TO ASME CODES AND STANDARDS" (PDF). UMass Lowell. Archived from the original (PDF) on 12 జూలై 2018. Retrieved 6 February 2021.
  3. "International Society of Interdisciplinary Engineers LLC acquires Techstreet - November 10, 2020". knowledgespeak. 2021-02-04. Retrieved 2021-02-04.{{cite web}}: CS1 maint: url-status (link)


మూలాలు

మార్చు