అమ్మ (1939 సినిమా)
అమ్మ 1939లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం 1939 మార్చి 16న విడుదలైంది. అరోరా ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్ పాల్ దర్శకుడు. స్క్రిప్ట్ కూడా ఆయనే సమకూర్చారు. దర్శకుడు నిరంజన్ పాల్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ నాయకుడు అయిన బిపిన్ చంద్ర పాల్ కుమారుడు.[1]
అమ్మ (1939 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నిరంజన్ పాల్ |
---|---|
తారాగణం | లక్ష్మీరాజ్యం |
నిర్మాణ సంస్థ | అరోరా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అమ్మ’ సినిమా తారాగణం, మిగతా సాంకేతిక నిపుణుల గురించిన సమాచారం అందుబాటులో లేదు. ఈ సినిమాని 1939 మార్చి 16న సెలెక్ట్ టాకీస్ (విశాఖపట్నం), క్రౌన్ టాకీస్ (కాకినాడ), ఇంపీరియల్ టాకీస్ (సికింద్రాబాద్)లో విడుదల చేశారు.
విశాఖపట్నం సెలెక్ట్ టాకీస్‌లో ఈ సినిమాని విడుదల చేసిన రోజు అప్పటి ఆంధ్రా యూనివర్సిటీ వై చాన్సలర్ సి.ఆర్. రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు.[2]
తారాగణం సవరించు
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం; నిరంజన్ పాల్
- నిర్మాత: దాసరి కొట్టిరత్నం[3]
మూలాలు సవరించు
- ↑ "Amma (1939)". Indiancine.ma. Retrieved 2020-08-10.
- ↑ "80 years of Amma (1939) - 80 ఏళ్ల 'అమ్మ' (1939)". ActionCutOk (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-03-16. Archived from the original on 2020-10-22. Retrieved 2020-08-10.
- ↑ "Amma (1939)". www.actiononframes.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-29. Retrieved 2020-08-10.