అరబింద ధాలి
అరబింద ధాలి, ఒక ఒడిశాకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు. ధాలి ఒడిశా శాసనసభకు ఆరవసార్లు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.1992 నుండి 2000 వరకు మల్కన్‌గిరి [1] నుండి, 2009 నుండి 2014 వరకు జయదేవ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.[2] అతను బిజూ జనతా దళ్ , భారతీయజనతా పార్టీ కూటమిలో మాజీ రవాణా, కార్పొరేషన్ మంత్రిగా చేసాడు. [3] [4] అతను 2006 ఏప్రిల్ 30న భారతీయ జనశక్తి పార్టీలో చేరడానికి బిజెపి, ఒడిశా నుండి వైదొలిగారు. ఒడిశా శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ రామ చంద్ర పాండాతో కలిసి భారతీయ జనశక్తి పార్టీలో చేరారు. ఆ తర్వాత, 2008 మార్చి 24న సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. [5] తరువాత, అతను తిరిగి బిజూ జనతాదళ్‌లో చేరాడు. 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో జయదేవ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. తరువాత అతను బిజెడిని వీడి, 2024 మార్చి 3న భారతీయ జనతా పార్టీలో చేరాడు. [6] ఖుర్దా జిల్లా లోని జయదేవ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఢాలి 2024 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బిజెపి నుండి బిజూ జనతా దళ్ అభ్యర్థి నబా కిషోర్ మల్లిక్ పై పోటీ చేసి ఓడిపాయాడు. [7]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Sitting and previous MLAs from Malkangiri Assembly Constituency". elections.in.
- ↑ "Sitting and previous MLAs from Jayadev Assembly Constituency". elections.in.
- ↑ "'Daughter' roped in to defeat 'father'"
- ↑ "Former Minister Arabinda Dhali to join in the ruling BJD". Archived from the original on 20 December 2016. Retrieved 16 December 2016.
- ↑ "Orissa unit of Bharatiya Janshakti merges with SP". news.webindia123.com. Archived from the original on 12 February 2021. Retrieved 2021-03-03.
- ↑ "Odisha: Jayadev MLA Arabinda Dhali quits BJD, to join BJP". The Economic Times. 2024-03-03. ISSN 0013-0389. Retrieved 2024-04-02.
- ↑ "odisha assembly elections: BJP releases list of 112 candidates for Odisha assembly elections". The Economic Times. Retrieved 2024-04-06.