అరుణ్ గోయల్
అరుణ్ గోయల్ (జననం 7 డిసెంబర్ 1962) 1985 పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన నవంబర్ 19, 2022న భారత ఎన్నికల కమీషనర్‌గా నియమితుడై నవంబర్ 21, 2022న బాధ్యతలు స్వీకరించాడు.[3]
అరుణ్ గోయల్ | |||
భారత ఎన్నికల కమీషనర్ | |||
భారత ఎన్నికల కమీషనర్
| |||
పదవీ కాలం 19 నవంబర్ 2022 – 9 మార్చి 2024 (రాజీనామా చేశాడు) [1][2] | |||
ముందు | రాజీవ్ కుమార్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పంజాబ్, భారతదేశం | 1962 డిసెంబరు 7
జననం, విద్యాభాస్యం
మార్చుఅరుణ్ గోయల్ పంజాబ్‌లో 1962లో జన్మించాడు. ఆయన పంజాబీ విశ్వవిద్యాలయం నుండి గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ఆ తరువాత అతను ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని చర్చిల్ కాలేజీ నుండి డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుఅరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి. ఆయన 1989లో సబ్-డివిజనల్ ఆఫీసర్ (SDO)గా తన వృత్తిని ప్రారంభించి సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి & ఆర్థిక సలహాదారుగా, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్-ఛైర్మెన్‌గా, రెవెన్యూ శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేశారు. గోయల్ లూథియానా జిల్లా (1995-2000), భటిండా జిల్లా (1993-94) జిల్లా ఎన్నికల అధికారిగా వివిధ లోక్‌సభ , విధానసభ ఎన్నికలను సజావుగా నిర్వహించాడు.
అరుణ్ గోయల్ డిసెంబర్ 2019 నుండి నవంబర్ 2022 వరకు భారీ పరిశ్రమల కార్యదర్శిగా పని చేసి 2022 డిసెంబర్ 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్న 2022 నవంబర్ 18న ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా ఆయనను నవంబర్ 19న భారత కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించింది.[4]
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గోయల్ 2024 మార్చి 8న తన పదవికి చేయగా ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించింది.[5][6]
మూలాలు
మార్చు- ↑ Nath, Damini; G, Manoj C; Chopra, Ritika (9 March 2024). "EC quits, Commission down to one; PM panel to meet next week to fill vacancies". The Indian Express. Retrieved 9 March 2024.
- ↑ "'Very concerning': Opposition reacts to election commissioner Arun Goel's sudden resignation ahead of Lok Sabha polls". The Times of India. 9 March 2024. Retrieved 9 March 2024.
- ↑ Andhrajyothy (10 March 2024). "ఈసీలో కలకలం!.. అనూహ్యంగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా". Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
- ↑ "Who is Arun Goel?". 2021. Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ Sakshi (9 March 2024). "ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా". Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.
- ↑ Mint (9 March 2024). "Meet Arun Goel, the 'record breaker' ex-election commissioner" (in ఇంగ్లీష్). Archived from the original on 11 March 2024. Retrieved 11 March 2024.