1982 నుంచి 1989 మధ్య భారత క్రికెట్ జట్టుకు ప్రాతిధ్యం వహించిన అరుణ్ లాల్ పూర్తి పేరు జగదీశ్ లాల్ అరుణ్ లాల్ (Jagdishlal Arun Lal) (Hindi : जगदीशलाल अरुण लाल). ఇతడు ఆగస్టు 1, 1955ఉత్తర ప్రదేశ్ లోని మొరదాబాదులో జన్మించాడు. కుడిచేతి వాటం గల అరుణ్ లాల్ అంతర్జాతీయ మ్యాచ్ లలో అంతగా రాణించలేడు. అతని బ్యాటింగ్ సగటు కేవలం 26.03 మాత్రమే. దేశీయ క్రికెట్ లో మాత్రం బెంగాల్, ఢిల్లీ తరఫున ఆడి మెరుగ్గా రాణించి 46.94 సగటుతో 10,000 కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 287 పరుగుల అత్యధిక స్కోరు కూడా ఉంది.

Arun Lal
[[Image:Arunlal.jpg.jpg|154px|]]
Flag of India.svg India
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి Right-hand bat
బౌలింగ్ శైలి Right-arm medium
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 16 13
పరుగులు 729 122
బ్యాటింగ్ సగటు 26.03 9.38
100లు/50లు -/6 -/1
అత్యుత్తమ స్కోరు 93 51
వేసిన బంతులు 16 -
వికెట్లు - -
బౌలింగ్ సగటు - -
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగ్ - -
క్యాచ్ లు/స్టంపింగులు 13/- 4/-

As of 4 February, 2006
Source: [1]

టెస్ట్ గణాంకాలుసవరించు

అరుణ్ లాల్ భారత జట్టు తరఫున 16 టెస్టులు ఆడి 729 పరుగులు సాధించాడు. అతని సగటు 26.03 పరుగులు. ఇందులో 6 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 93 పరుగులు.

వన్డే గణాంకాలుసవరించు

భారత జట్టు తరఫున అరుణ్ లాల్ 13 ఒక రోజు క్రికెట్ పోటీలు ఆడి 9.38 సగటుతో 122 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థ సెంచరీ ఉంది. అతని అత్యధిక స్కోరు 51 పరుగులు.