అర్చన జోగ్లేకర్
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి.
అర్చన జోగ్లేకర్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి. మరాఠీ, ఒడియా, హిందీ సినిమాలు, టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది.
అర్చన జోగ్లేకర్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ముంబై, మహారాష్ట్ర |
సంగీత శైలి | హిందుస్థానీ సంగీతము |
వృత్తి | సినిమా నటి, శాస్త్రీయ నృత్యకారిణి |
సినిమారంగం
మార్చుసన్సార్ (హిందీ), ఏకా పేక్ష ఏక్ (మరాఠీ), అనాపేక్షిత్ (మరాఠీ) సినిమాలో నటించి గుర్తింపు పొందింది. కథక్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్.[1] కథక్ నృత్య కళాకారిణి, శిక్షకురాలైన తన తల్లి ఆశా జోగ్లేకర్ ద్వారా కథక్‌లో శిక్షణ పొందింది. 1963లో, తల్లి ముంబైలో అర్చన నృత్యాలయ అనే నృత్య పాఠశాలను స్థాపించింది. 1999లో, జోగ్లేకర్ యుఎస్ లోని న్యూజెర్సీలో ఈ డ్యాన్స్ స్కూల్ శాఖను ప్రారంభించింది.[2]
సినిమాలు
మార్చు- 1987: సునా చదేయ్ (ఒడియా)
- 1988: రంగత్ సంగత్
- 1988: మర్దంగి
- బ్రహ్మర్షి విశ్వామిత్ర
- 1987: సన్సార్ (రజనీ)
- 1989: బిల్లూ బాద్షా (నిషా)
- 1990: సోనాగా ఏకా పేక్ష ఏక్ (మరాఠీ)
- 1991: బాత్ హై ప్యార్ కి (అంజలి)
- 1994: మొగముల్ (తమిళం)
- 1995: ఆటంక్ హాయ్ ఆటంక్ (రజియా) [3]
- 1998: ఆగ్ సే ఖేలేంగే
- 1998: స్త్రీ (ఒడియా)
- 2012: మ్యారీడ్ టూ అమెరికా (అంజలి మల్హోత్రా)
- నివ్‌దుంగ్ (రవీంద్ర మంకనితో మరాఠీ చిత్రం)
- అన్పేక్షిత్ (నితీష్ భరద్వాజ్, అశోక్ సరాఫ్‌లతో)
టెలివిజన్
మార్చు- చునౌటి (1987)
- కర్మభూమి
- ఫూల్వంతి (1992) ఫూల్వంతిగా
- కిస్సా శాంతి కా
- పూజా పాత్రలో చాహత్ ఔర్ నఫ్రత్ (1999)
మూలాలు
మార్చు- ↑ Defrance, Y., 2001. L'Encyclopedie Garland des musiques du monde (suite), The Garland Encyclopedia of World Music. New York and London: Garland Publishing, Inc. 10 vol., 1998-2004. Cahiers d'ethnomusicologie. Anciennement Cahiers de musiques traditionnelles, (14), pp.290-299.
- ↑ Archana Joglekar Dance Academy: How Archana Joglekar made Kathak a global art form. Chakpak News Service on 15 Jun 2011.
- ↑ Kirti Sisodia (2017). Aamir Khan: A Social Spark. Prabhat Prakashan. pp. 3–. ISBN 978-93-5266-118-3.