అర్జున్ ఎరిగైసి
అర్జున్ ఎరిగైసి (జననం 3 సెప్టెంబర్ 2003) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్. అతను 14 సంవత్సరాల, 11 నెలల, 13 రోజుల వయస్సులో గ్రాండ్ మాస్టర్ బిరుదును సంపాదించాడు. గ్రాండ్ మాస్టర్ బిరుదును సాధించిన 32 వ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతను భారతదేశం నుండి 54 వ గ్రాండ్ మాస్టర్.[1]
అర్జున్ ఎరిగైసి | |
---|---|
దేశం | ఇండియా |
పుట్టిన తేది | 3 September 2003 | (age 21)
టైటిల్ | Grandmaster (2018) |
అత్యున్నత రేటింగ్ | 2660 (March 2022) |
తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్ (జిఎం)
మార్చువరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన అర్జున్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన అబుదాబి మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో 17వ స్థానంలో నిలిచి జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో అర్జున్ 6 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా అతనికి 17వ స్థానం లభించింది. అర్జున్ నలుగురు గ్రాండ్‌మాస్టర్స్ పెట్రోసియాన్ (అర్మేనియా), అహ్మద్ (ఈజిప్ట్), అమీన్ బాసెమ్ (ఈజిప్ట్), సనన్ (రష్యా)లతో జరిగిన వరుస గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. టోర్నీ మొత్తంలో ఒక గేమ్‌లో మాత్రమే ఓడిన అర్జున్ నాలుగు గేముల్లో గెలిచి, మిగతా నాలుగింటిని ‘డ్రా’గా ముగించాడు. దీంతో 14 సంవత్సరాల, 11 నెలల, 13 రోజుల వయస్సులోనే అర్జున్ గ్రాండ్ మాస్టర్ బిరుదును సంపాదించి, తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి గ్రాండ్‌మాస్టర్ గా (జీఎం) భారతదేశం నుండి 54వ గ్రాండ్ మాస్టర్ గా నిలిచాడు. అర్జున్ తో పాటు మన దేశానికే చెందిన నిహాల్ సరీన్, కార్తీక్ వెంకటరామన్ లు కూడా గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.[2]
టాటా స్టీల్ చాలెంజర్ చెస్ టైటిల్ సొంతం
మార్చునెదర్లాండ్స్లో జరిగిన టాటా స్టీల్ ఇంటర్నేషనల్ చాలెంజర్ చెస్ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. ప్రారంభం నుండే మంచి ప్రదర్శన చేసిన అర్జున్ మరో రౌండ్ మిగిలుండగానే టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శన తో 2023లో జరిగే టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీకి క్వాలి ఫై అయ్యాడు.[3]
జాతీయ చెస్ ఛాంపియన్ షిప్ విజేత
మార్చుకాన్పూర్ వేదికగా జరిగిన జాతీయ చెస్ ఛాంపియన్ షిప్ లో అర్జున్ విజేత గా నిలిచాడు. టైబ్రేకర్ లో గ్రాండ్ మాస్టర్ లు గుకేష్, ఇనియన్ (తమిళనాడు)ను ఓడించి అర్జున్ తొలిసారి జాతీయ చాంపియన్ గా అవతరించాడు. 11 రౌండ్ల అనంతరం అర్జున్, గుకేష్, ఇనియన్ లు 8.5 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారు. దీంతో అనివార్యమైన టై బ్రేకర్ లో మిగిలిన ఇద్దరికంటే మెరుగైన స్కోరు సాధించడంతో విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో అర్జున్ ఒక్క పోటీలో కూడా ఓటమి పాలు కాలేదు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన అర్జున్ కు 6 లక్షల రూపాయల నగదు బహుమతి లభించింది.[4]
సాధించిన పథకాలు
మార్చు- 2015 వ సంవత్సరం లో కొరియాలో జరిగిన ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ రజత పతకం సాధించాడు.
- టాటా స్టీల్ ఇంటర్నేషనల్ చాలెంజర్ చెస్ టోర్నీ విజేత - 2021
- అక్టోబర్ 2021లో, బల్గేరియాలో జరిగిన జూనియర్ అండర్-21 రౌండ్ టేబుల్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ (క్లాసికల్)లో అర్జున్ 2వ స్థానంలో నిలిచాడు.
- జాతీయ చెస్ ఛాంపియన్ షిప్ విజేత - 2022
మూలాలు
మార్చు- ↑ "Arjun Erigaisi", Wikipedia (in ఇంగ్లీష్), 2022-03-03, retrieved 2022-03-05
- ↑ "'గ్రాండ్‌మాస్టర్' అర్జున్". Sakshi. 2018-08-16. Retrieved 2022-03-05.
- ↑ Velugu, V6 (2022-01-30). "టాటా స్టీల్ చాలెంజర్ చెస్ టైటిల్ గెలిచిన అర్జున్". V6 Velugu (in ఇంగ్లీష్). Retrieved 2022-03-05.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ krishna (2022-03-03). "అర్జున్‌కు జాతీయ చెస్ టైటిల్". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-03-05.