అలవాటు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అలవాటు (habit) అనగా ఏదైనా ఒక పనిని మళ్ళీ, మళ్ళీ అదే తడవుగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన. వ్యక్తి ప్రమేయము ఉండకపోవచ్చు. అలవాటు అనగానే మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచి అలవాట్లు పరవాలేదు గాని, చెడు అలవాట్లే ఆలోచించదగ్గవి. కొన్ని చెడు అలవాటులు తన చుట్టూ ఉన్నవారికి ఏ హాని చేయవు, కొన్ని అలవాట్లు వ్యక్తికి, ఇతరులకు చెడు చేస్తాయి. కొన్ని ఇతరులకు మాత్రమే కీడు చేస్తాయి. అలవాటనేది పూర్తిగా మానసికమైనదే. పరిసర వాతావరణము, వ్యక్తులు, జంతువులు, తను చేస్తున్న పని, కుటుంబ ఆర్థిక - సామాజిక స్థితిగతులు, సహవాసాలు అలవాట్లను ఎంతగానో ప్రభావితము చేస్తాయి. చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల కుటుంబాలు చిన్నా భిన్నమైన ఉదాహరణములెన్నోకలవు. సమాజములో ఆ వ్యక్తికి సరియైన గౌరవముండదు.
అలవాట్లలో చిన్నస్థాయి, మధ్యస్థ, పెద్దస్థాయి అనే రకాలుంటాయి. ఈ క్రిందన అవి, ఇవి, అన్నీ కొన్ని ఉదాహరణములుగా చదవండి..
చెడ్డ అలవాట్లుసవరించు
బియ్యము తినడముసవరించు
బియ్యం తినడం చెడ్డదేమి కాకపోయినా తినేవారిలో మానసిక అలజడి, అశాంతి ఉన్నాయని సూచిస్తుంది. ఎంత ప్రయత్నించినా దీనిలోనుంచి బయటకు రాలేకపోతుంటే ఏదైనా మానసిక సమస్యతో కలత చెందుచున్నారేమో ఆలోచించాలి. వాటిని పరిస్కరించే ప్రయత్నము చేయాలి. ఈ అల్వాటు ఆడువారిలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లలలో ఉండవచ్చు. పెద్దవారైన మగవారిలో చాలాతక్కువ. కడగని బియ్యం పైన దుమ్ము, బాక్టీరియా ఉంటాయి, వాటివలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. దీనివలన ఆకలి తగ్గడం, సమయానికి ఆహారము తీసుకోకపోవడం, సరియైన ఆహారము తినకపోవడం వలన రక్తహీనత, నీరసము రావటం, మొదలైన సమస్యలు తలెత్తుతాయి.
ఈ అలవాటున్నవారు తమకు అందుబాటులో బియ్యం డబ్బా లేకుండా చూసువాలి. బియ్యము తినాలనిపించేటపుడు ఏవైనా పండ్లు, సోపు, బబుల్ గమ్ము, వంటివి నములుతూ ఈ అలవాటును మానే ప్రయత్నము చేయాలి.
పొగ త్రాగడంసవరించు
- సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగడం ఒక చెడ్డ అలవాటు. వీనిలోని పొగాకు నుంచి 'నికోటిన్' అనే విషపదార్ధం ఊపితితిత్తుల ద్వారా మన శారీరంలోనికి ప్రవేశించి వివిధ రకాల వ్యాధులు కలగజేస్తుంది.
మద్యపానంసవరించు
మద్యపానం ఏ విధంగానైనా ఒక దురలవాటు.
మంచి అలవాట్లుసవరించు
క్రమశిక్షణసవరించు
క్రమమైన పద్ధతిని అనుసరించడం క్రమశిక్షణ. ఇది ప్రతివ్యక్తిలోను అంతర్గతంగా ఉన్నప్పుడు తనకు, సంఘానికి, దేశానికి చాలా మంచిది.
పెద్దలను గౌరవించడంసవరించు
అన్ని మతాలలో, సంఘాలలో పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం చాలా మంచి అలవాటు.
గాలిపటాలు ఎగురవేయడంసవరించు
గాలిపటాలు ఎగురవేయడం వలన ఉత్సాహం కలుగుతుంది. శారీరక శ్రమనుండి విముక్తి లభిస్తుంది.