అల్లాడి రామచంద్రయ్య

అల్లాడి రామచంద్రయ్య తెలుగు భాషా పరిశోధకుడు. ఈయన తండ్రి పేరు సుబ్బాజి. బ్రిటీషర్ల సంపర్కం వల్ల, వారి శాస్త్ర గ్రంథాల అవలోకనం వల్ల తెలియవచ్చే విషయాలపై తర్కించి ఆయన సిద్ధాంతాలు చేశాడు. ఇదే క్రమంలో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని 1836లో వ్రాశాడు. విల్కిన్ సన్ దొర చంద్రపురం కలెక్టరుగా వచ్చినప్పుడు, అల్లాడి రామచంద్రయ్య వద్ద శిష్యుడిగా చేరారు. ఆయన చేత వ్యవహార మయూఖం గురించి పాఠాలు చెప్పించుున్నారు. తర్వాత బ్రహ్మ సిద్ధాంత, రోమక సిద్ధాంత, ఆర్యభట్ట సిద్ధాంత, లీలావతి బీజగణిత మొదలైన గ్రంథాలను విల్కిన్సన్ సన్ ఉత్తరాది నుండి తెప్పించారు. వాటిని చదివి రామచంద్రయ్య తెలుగులో సిద్ధాంతాలు తయారుచేసేవారు..[1]

అల్లాడి రామచంద్రయ్య
ప్రసిద్ధిపరిశోధకుడు, సిద్ధాంతకర్త
తండ్రిసుబ్బాజి

గ్రంథాలు మార్చు

రామచంద్రయ్య రాసిన సిద్ధాంత శిరోమణి ప్రకాశిక గ్రంథం తొలుత మరాఠీలో అచ్చయింది. ఈ గ్రంథ ప్రతులను కాశి, అవంతి, పూనా, కలకత్తా, బొంబాయి వార్డు సాహెబుల వద్దకు, పండితుల వద్దకు పంపారు. వారు రామచంద్రయ్య ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. తర్వాత ఇదే గ్రంథాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. తులనాత్మక పరిశీలనతో రెండు సంప్రదాయలను అధ్యయనం చేసిన వ్యక్తి రామచంద్రయ్య.

మూలాలు మార్చు

  1. ఆరుద్ర, ఆరుద్ర (2019). సమగ్రాంధ్ర సాహిత్యము. హైదరాబాద్: తెలుగు అకాడమి. Retrieved 11 December 2019.