మెమెసిలోన్ అంబెల్లటం ను సాధారణంగా ఐరన్‌వుడ్ , అంజని (మరాఠీ) లేదా అల్లి కరంద(తెలుగు) అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశం, అండమాన్ దీవులు, దక్కన్ తీర ప్రాంతంలో కనిపించే ఒక చిన్న చెట్టు.[1]  ఇది శ్రీలంకలో కూడా కనిపిస్తుంది, ఇక్కడ దీనిని బ్లూ మిస్ట్ , కోర-కహా ( సింహళ భాష ) , కుర్రికాయ ( తమిళ భాష ) అని పిలుస్తారు. ఆకులలో పసుపు రంగు, ఒక గ్లూకోసైడ్ ఉంటుంది, ఇది బౌద్ధ సన్యాసుల వస్త్రాలకు రంగు వేయడానికి, రెల్లు చాపలకు (దుంబర మాట్స్) రంగు వేయడానికి ఉపయోగిస్తారు. ఔషధ పరంగా అతిసార వ్యాధి నుండి రక్షించేందుకు ఈ ఆకులకు రోగనిరోధకశక్తి ఉందని చెబుతారు.[2]  చారిత్రాత్మకంగా, ఈ ప్లాంట్ వూట్జ్ స్టీల్ ఉత్పత్తిలో ఇంధనంగా కాల్చబడింది . గృహ నిర్మాణానికి, పడవల తయారీలో కూడా ఈ చెట్టు కలప వాడుతారు. ఈ కలప ఇనుములా గట్టిగ ఉంటుందని ఐరన్ వుడ్ అని వ్యవహరించబడింది.

అల్లి
Scientific classification Edit this classification
Unrecognized taxon (fix): Melastomataceae
Genus: Memecylon
Species:
M. umbellatum
Binomial name
Memecylon umbellatum

తెలుగు రాష్ట్రాలలో

మార్చు

ఆంధ్ర, తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో, చిట్టడవుల్లో అల్లిచెట్లు తరచూ కనిపిస్తాయి. వర్షాకాలంలో, జూన్,జూలై, ఆగష్టు మాసాల్లో అల్లిపళ్ళు సమృద్హిగా లభ్యమవుతాయికాస్తాయి. పండ్లు కుంకుడుగింజ అంత ప్రమాణం గుండ్రంగా, నల్లగా ఉంటాయి.శ్రీశైలంవద్ద, కృష్ణ ఇరుదరుల చెంచులు ఈ పళ్లను సేకరించి సమీపంలోని గ్రామాల్లో, టౌన్ లలో అమ్ముతుంటారు. పండ్ల సేకరణ చాలా కష్టమైనపని. మనుషులు చొరలేని చిక్కని ముళ్లపొదలు, చెట్లనడుమ అక్కడక్కడా ఈ చెట్లు, షుమారైన మాన్లు ఉంటాయి.

కొమ్మకొమ్మకు, అంటుకొని చిన్న ఉసిరిక పిందెల్లాగా పచ్చి కాయలు, క్రమంగా పండి పసుపు, చివరకు పళ్ళు నల్లద్రాక్ష రంగుకు మారతాయి. పండు ఆకారం కుంకుడు గింజ అంత ఉంటుంది. ఈ అల్లిచెట్టు పచ్చి కట్టెలు కూడా పొయ్యిలో పెడితే బాగా మండుతాయి. ఈ పళ్ళను పక్షులు, అడవి కుందేళ్లు, జింకలు వంటివి ఇష్టంగా తింటాయి.

చెంచులు ఈ పళ్ళను ఇష్టంగా తింటారు, సేకరించి గ్రామాల్లో అమ్ముతారు. పళ్ళు తీయగా, రుచిగా ఉంటాయి. తిన్నతర్వాత నోరంతా నీలంగా ఉండి, కాసేపటికి మామూలవుతుంది.

చిత్ర మాలిక

మార్చు

== మూలాలు ==. 1.అప్పారావు ముప్పాళ్ళ తెలుగు Quoraలో రాసిన వ్యాసం,2. గణితయోగ స్వచ్చంద సంస్థ సేకరించిన వివరాలు.3. ఫోటోలు; కాళిదాసు వంశీధర్

  1. "Medicinal plants of India with anti-diabetic potential". Journal of Ethnopharmacology. 81 (1). Ireland: 2002 Elsevier Science Ireland Ltd.: 81–100 June 2002. doi:10.1016/S0378-8741(02)00059-4. PMID 12020931. {{cite journal}}: Cite uses deprecated parameter |authors= (help)
  2. S. R. Kottegoda, Flowers of Sri Lanka, 1994; Colombo: Royal Asiatic Society of Sri Lanka. ISBN 9559086014
"https://te.wikipedia.org/w/index.php?title=అల్లి&oldid=4041668" నుండి వెలికితీశారు