అవంతీ సుందరి
అవంతీ సుందరి ప్రాకృత భాషలో కవిత్వ రచన చేసిన వ్యక్తి. ప్రాచీన కాలం నాటి కవయిత్రిగా ఆమె చరిత్రకెక్కారు.
అవంతీ సుందరి | |
---|---|
జననం | సా.శ.. 9శతాబ్దం |
వృత్తి | ప్రాకృత కవయిత్రి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రాచీన కాలం నాటి కవయిత్రి |
జీవిత భాగస్వామి | రాజశేఖరుడు (ప్రాకృత పండితుడు) |
స్థలకాలాలు
మార్చుఅవంతీ సుందరి క్రీ.పూ.9వ శతాబ్దిలో జీవించారు. ఆమె ప్రాకృత సాహిత్యంలో గొప్ప నాటకకర్తగా, మహాపండితుడిగా ప్రఖ్యాతుడైన రాజశేఖరుని భార్య. రాజశేఖరుని పలు రచనల్లో తన భార్య అవంతీ సుందరి చౌహాన్ల కుటుంబానికి చెందిన వ్యక్తి అనీ, తన బాలరామాయణ కావ్యంలో తాము మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారమని ప్రస్తావించారు.[1]
సాహిత్యరంగం
మార్చురాజశేఖరుని సాహిత్యంలో ఆమె ప్రస్తావనలు పలుమార్లు వస్తాయి. ఆమె స్వయంగా కవిత్వం రచించినట్లు, భర్త కవిత్వ రచనలో ప్రోత్సాహం, సహకారం అందజేసినట్లు పలు సారస్వతాధారాలు కనిపిస్తున్నాయి. సాహిత్యాన్ని గురించి, సాహిత్యాభిరుచి గురించి ఆమె చేసిన పలు వ్యాఖ్యలను, విమర్శ దృక్పథాన్ని గురించి తన కర్పూరమంజరి నాటకంలో రాజశేఖరుడు ప్రస్తావనలు చేశారు. హేమచంద్రుడు రచించిన 12వ శతాబ్ది నాటి దేశీ నామమాలలో కొన్ని పేర్లను విశదీకరించడానికి అవంతీ సుందరి రచించిన కొన్ని కవితలను ఉదహరించారు. దీనివల్ల ఆమె కవిత్వం బహుళ ప్రాచుర్యంలో ఉండేదని స్పష్టమవుతోంది.[2]
మూలాలు
మార్చు- ↑ ఎ.కె.వార్డర్(1988):ఇండియన్ కావ్య లిటరేచర్:చాప్టర్ XLII
- ↑ సుశీ.జె.తరు, కె.లలిత:ఉమన్ రైటింగ్స్ ఆఫ్ ఇండియా-600బి.సి. టు ఎర్లీ ట్వంటీత్ సెంచరీ