అవలోకితేశ్వరుడు

బౌద్దంలో అవలోకితేశ్వరుడు (సంస్కృతం:अवलोकितेश्वर ) టిబెటన్ బౌద్ధమతంలో ఒక ముఖ్యమైన దేవత. వజ్రాయన బోధనలలో ఆయన బుద్ధుడిగా పరిగణించబడ్డాడు. ఇతను పంచబౌద్ధావతారాలలో ఒకడు. తూర్పుదిక్కుకు అధిపతి. ఈ అవతారం సృష్టిలోని అందరు బుద్ధుల కరుణ, ప్రేమ, దయ తత్వాల సారాన్ని మూర్తీభవింపచేసుకున్న రూపం.[1] అవలోకితేశ్వరుడు సృష్టిలోని జీవులన్నిటికీ బుద్ధత్వం పొందడానికి సహాయం చేస్తాడని బౌద్ధుల విశ్వాసం. అన్ని బోధిసత్వాల్లో వ్యక్తమైన దయాదాక్షిణ్యాల మూలం అయిన బోధిసత్వలలో అవలోకితేశ్వరుడు ఒకరు. మహాయాన బౌద్ధంలో ఆయన అత్యంత గౌరవనీయుడైన బోధిసత్వుడు. శతాబ్దాలుగా అనేక పరివర్తనలకు గురయ్యాడు. ఈ బోధిసత్వాన్ని వివిధ సంస్కృతుల్లో స్త్రీ లేదా పురుషులుగా వర్ణించారు.[2] టిబెటన్ బౌద్ధంలో అవలోకితేశ్వరుడు నాలుగు చేతులతో మొదలు వేయి చేతులతో దర్శనమిస్తాడు.[3]. ఈ అవతారంలో అవలోకితేశ్వరుడు నిర్వాణం పొందినప్పటికీ మానవాళిపై అపార కరుణను ప్రసరింపజేస్తూ వారిని నిర్వాణాభిముఖులను చేస్తాడు.

చైనాలోని జెజియాంగ్ లోని వేయి చేతుల, పదకొండు ముఖాల అవలోకితేశ్వరుడి విగ్రహం (పవిత్ర గుయాన్యిన్)

వివిధ పేర్లుసవరించు

టిబెట్ లో చెన్రెజ్గ్ గా ప్రసిద్ధి చెందాడు. చైనా, తైవాన్ మరియు ఇతర చైనీస్ సమాజాలలో, ఒలోక్తేశ్వర , పవిత్ర గుయాన్యిన్ లేదా గ్వాన్షిన్ వంటి కొన్ని స్త్రీమూర్తి గా దర్శనమిస్తాడు. శ్రీలంకలో నాథ దేవియో, మయన్మార్ (బర్మా)లో లోకనాథగా ప్రసిద్ధి చెందారు. థాయ్ లాండ్ మరియు కంబోడియాలో లోకేస్వర అని పిలుస్తారు. అవలోకితేశ్వరుడు పద్మపాణి (చేతిలో తామరపూవును ధరించేవాడు) అని కూడా గౌరవించబడ్డాడు. టిబెట్‌లోని దలైలామాని అవలోకితేశ్వరుని అవతారంగా భావిస్తారు.[4] ఇతనిని అవలోకితేశ్వర బుద్ధుడు లేదా లోకేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అవలోకితేశ్వరుడు అంటే సమస్త లోకాలకు రాజు అని అర్ధం కావచ్చు. అవలోకితేశ్వర అనే పదం మూడు భాగాలతో రూపొందించబడింది, అవ అంటే క్రింద, లోకిత అంటే చూడడం, ఈశ్వర అంటే దేవుడు. ఇతను 108 విభిన్న రూపాలను కలిగి ఉన్నాడు.

బోధిసత్వులుసవరించు

బౌద్ధమతంలో, బౌద్ధత్వం వైపు మార్గంలో ఉన్న ఏ వ్యక్తిని అయినా బోధిసత్వునిగా పేర్కొనవచ్చు. అవలోకితేశ్వరుడు, మంజుశ్రీ, వజ్రపాణి లాంటి వారిని బోధిసత్వులుగా, గౌతముడు, అమితాభుడు, మైత్రేయనాథులను బుద్ధులుగా పేర్కొంటారు.

మూలాలుసవరించు

  1. "Avalokiteshvara | bodhisattva | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  2. Larson, Kay. "Who Is Avalokiteshvara? - Lion's Roar" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-02-07.
  3. "అల్చి – విహారం | సంచిక - తెలుగు సాహిత్య వేదిక" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-05-26. Retrieved 2022-02-07.
  4. "Avalokiteshvara". www.dharmanet.org. Retrieved 2022-02-07.