అవిశ్వాస తీర్మానం

(అవిశ్వాస తీర్మానము నుండి దారిమార్పు చెందింది)

ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తివంతమైన రాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి.

మండల పరిషత్

మార్చు

అధ్యక్ష, ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానము:

  • మండల పరిషత్ ప్రాధేశిక సభ్యులు 50 శాతం మంది సంతకం చేసి వ్రాతమూలకమైన నోటీసు ఇచ్చుట ద్వారా మండల పరిషత్ అధ్యక్షునిపైన అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించవచ్చు.
  • పదవిలో చేరిన 2 సంవత్సరాలలోపు ఈ ప్రతిపాదన తీసుకొని రాకూడదు.
  • పదవీకాలములో ఒకసారి మాత్రమే ఇట్టి ప్రతిపాదన చేయాలి.
  • సమావేశ సమయములో మొత్తం సభ్యులను లెక్కించేటప్పుడు, ఖాళీగా వున్న సభ్యుల స్థానాలను వదిలేసి, అధ్యుక్షుని కలుపుకొని అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికై జరుగు ఎన్నికలలో ఓటు వేయుటకు హక్కు గల సభ్యులనే లెక్కించాలి. సస్పెన్షన్ లో వున్న సభ్యులను కూడా లెక్కలోనికి తీసుకోవాలి.
  • మొత్తం సభ్యుల సంఖ్యలో మూడింట రెండు వంతులకు (2/3) తగ్గని సభ్యులు తీర్మానాన్ని సమర్ధిస్తే, ప్రభుత్వం సంబంధిత వ్యక్తిని పదవి నుండి తొలగిస్తూ నోటిషికేషన్లు జారీ చేస్తుంది.

లోక్‌సభ లేదా శాసనసభ

మార్చు

చెప్పనవసరం లేదు. సాధారణంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్ధతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాధికారం స్పీకర్ కు ఉంటుంది.