అష్ట కష్టాలు అనే పదం లెక్కలేనన్ని కష్టాలు అనే అర్థంలో వాడుతున్నారు. నిజానికైతే "దేశాంతర గమనం, భార్యావియోగం, ఆపత్కాల బంధుదర్శనం, ఉచ్ఛిష్ట భోజనం, శత్రుస్నేహం, పరాన్న ప్రతీక్షణం, అప్రతిష్ఠ, దారిద్య్రం" అనేవే అష్టకష్టాలు.  కాలక్రమంలో సంఖ్యాపరిమితి లేని కష్టాల గురించి చెప్పేటప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు కూడా ఈ పదాన్ని వాడటం రివాజైంది. "నేనీ పని పూర్తిచేయడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది"అనేది ఓ ప్రయోగం.[1]

అష్టా కష్టాలలో ఒకటైన వార్థక్యం

వివిధ విధాలుగా అష్ట కష్టాలు మార్చు

ఒకవిధం:

 1. ఋణం = అప్పులపాలైపోవడం
 2. యాచన = అడుక్కోవలసిరావడం
 3. వార్ధక్యం = ముసలితనం
 4. జారత్వం = వ్యభిచరించాల్సిరావడం
 5. చౌర్యం = దొంగల పాలబడ్డం
 6. దారిద్య్రము
 7. రోగం
 8. భుక్తశేషం = శేషమును భుజించుట.

ఇంకొకవిధం:

 1. దేశాంతరగమనం
 2. భార్యావియోగం
 3. ఆపత్కాలబంధుదర్శనం
 4. ఉచ్చిష్ఠభక్షణం
 5. శతృస్నేహం
 6. పరాన్నప్రతీక్షణం
 7. భంగం
 8. దారిద్ర్యం

ఇంకొకవిధం:

 1. దాస్యం
 2. దారిద్ర్యం
 3. భార్య లేకుండుట
 4. స్వయంకృషి
 5. యాచించుట
 6. అడిగిన లేదనుట
 7. ఋణం
 8. దారి నడచుట

మూలాలు మార్చు

 1. "సింగినాదం...అష్ట కష్టాలు". www.teluguvelugu.in. Archived from the original on 2020-08-04. Retrieved 2020-08-24.