అహోబిలం పార్వేట ఉత్సవం

"హరినామమే కడు ఆనందకరము" అని నిత్యం తనని పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహా విష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు. అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. స్వామి వారి రూపాన్ని చూసిన దేవదానవులు. అహో బలం.... అహో బలం అని ఆశ్చర్యపోయారు.ఇదే కాలక్రమేనా 'అహోబిలం' అనే పేరుతో స్థిరపడింది.ఇక్కడ కొలువైన నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి. ప్రతి సంవత్సరం ఫల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది.ప్రతి దేవాలయంలోనూ కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది.కానీ అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది .సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామి వారు కనుమనాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు[1].ఈ క్రమంలో అహోబిలం చుట్టుప్రక్కల ఉన్న 35 గ్రామాలలో 41 రోజులపాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు. ఈ సందర్శనలో కుల మతాల ప్రసక్తి గాని, ధనిక బీద తారతమ్యాలు గాని .ఆయా గ్రామాల పొలిమేరలకు స్వామివారి పల్లకి వస్తుంది.అక్కడ గ్రామాధికారులు ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారికి స్వాగతం పలుకుతారు.గ్రామంలోకి తోడుకొని వెళ్తారు.35 గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు. స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంత సేపు గ్రామమంతా పండుగ వాతావరణ నెలకొంటుంది. ఈ విధంగా స్వామి వారు గ్రామాలు సందర్శించడాన్నే పార్వేట ఉత్సవం అంటారు. స్వామి వారు చూసుకుంటారని అక్కడ వారి నమ్మకం[2]. పారువేట ఒక దేవ ఉత్సవం. 'పరి' అనగా గుర్రం , `వేట' అనగా దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గురించి జరిగేది.దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాలు నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి.స్వయంగా బ్రహ్మదేవుడు స్వామి వారి కల్యాణోత్సవం జరిపిస్తాడు.సకల దేవతలు స్వామివారి కల్యాణానికి హాజరవుతారని ప్రతీతి. దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా కొండ దిగువున శాంతమూర్తిగా, మొత్తం క్షేత్రం అంతా తొమ్మిది రూపాయలతో కొలువై ఉన్నారు. శ్రీమహావిష్ణువు నరసింహని అవతారంగా ఉద్భవించిన స్థలం కూడా ఇక్కడ ఉంది. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైన 97వ క్షేత్రం. స్వామి వారి కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక ,తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు[3].

  1. Chronicle, Deccan (2019-01-16). "Kurnool: Paruveta utsavam held in Ahobilam". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-09-09.
  2. ABN (2022-02-26). "ముగిసిన పార్వేట ఉత్సవం". Andhrajyothy Telugu News. Retrieved 2023-09-09.
  3. "భక్తుల చెంతకు అహోబిలేశుడు". EENADU. Retrieved 2023-09-09.