అహ్మద్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

(అహ్మద్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

అహ్మద్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం (Ahmednagar Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుంచి ఇప్పటివరకు జరిగిన 13 ఎన్నికలలో 11 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. 2009లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దిలీప్ కుమార్ గాంధీ విజయం సాధించి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

అహ్మద్ నగర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°6′8″N 74°45′1″E మార్చు
పటం
అహ్మద్‌నగర్ స్టేషన్

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

మార్చు

ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

విజయం సాధించిన అభ్యర్థులు

మార్చు
  • 1962: మోతీలాల్ ఫిరోడియా (కాంగ్రెస్ పార్టీ)
  • 1967: అనంతరావ్ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: అన్నాసాహెబ్ షిండే (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: అన్నాసాహెబ్ షిండే (కాంగ్రెస్ పార్టీ)
  • 1980: చంద్రభాన్ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: యశ్వంతరావ్ గఢక్ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: యశ్వంతరావ్ గఢక్ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1991: యశ్వంతరావ్ గఢక్ పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1996: మారుతి షెల్కే (కాంగ్రెస్ పార్టీ)
  • 1998: బాలాసాహెబ్ విఖే పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: దిలీప్ కుమార్ గాంధీ (భారతీయ జనతా పార్టీ)
  • 2004: తుకారాం గఢక్ (కాంగ్రెస్ పార్టీ)
  • 2009: దిలీప్‌కుమార్ గాంధీ (భారతీయ జనతా పార్టీ)
  • 2014:దిలీప్‌కుమార్ గాంధీ (భారతీయ జనతా పార్టీ)
  • 2019:సుజయ్ విఖే పాటిల్

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు చెందిన దిలీప్ కుమార్ గాంధీ తన సమీప ప్రత్యర్థి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన శివాజీ కార్దిలేపై 46,731 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 3,12,047 ఓట్లు రాగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 2,65,316 లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి రాజీవ్ రాజలే 1,52,795 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు