అహ్మద్ దేవర కోవిల్
అహ్మద్ దేవర కోవిల్ కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై విజయన్ రెండవ మంత్రివర్గంలో 2021 మే 20 నుండి 2023 డిసెంబరు 24 వరకు రాష్ట్ర ఓడరేవులు, మ్యూజియంలు, పురావస్తు శాఖ & ఆర్కైవ్ మంత్రిగా విధులు నిర్వహించాడు.[1][2]
అహ్మద్ దేవర కోవిల్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 20 మే 2021 | |||
ముందు | ఎం. కే. మునీర్ | ||
---|---|---|---|
ఓడరేవులు, మ్యూజియం, ఆర్కియాలజీ & ఆర్కైవ్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 20 మే 2021 – 24 డిసెంబరు 2023 | |||
ముందు | కదన్నపల్లి రామచంద్రన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ సౌత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | [ఇండియన్ నేషనల్ లీగ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ |
రాజకీయ జీవితం
మార్చుఅహ్మద్ దేవరకోవిల్ విద్యార్థి దశ నుండి ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కోజికోడ్ జిల్లాలో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా, ఏపీని చేసి ఇండియన్ నేషనల్ లీగ్లో చేరాడు. ఆయన 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కోజికోడ్ సౌత్ నియోజకవర్గం నుండి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థి నూర్బీనా రషీద్ పై 12,459 ఓట్ల మెజారిటీతో గెలిచి 2021 మే 20[3] నుండి 2023 డిసెంబరు 24 వరకు[4] విజయన్ రెండవ మంత్రివర్గంలో రాష్ట్ర ఓడరేవులు, మ్యూజియంలు, పురావస్తు శాఖ & ఆర్కైవ్ మంత్రిగా పనిచేశాడు.
మూలాలు
మార్చు- ↑ Prajasakti (25 December 2023). "29న కేరళ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ The Hindu (21 May 2021). "Kerala Cabinet | CM Pinarayi Vijayan retains Home, Veena gets Health" (in Indian English). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Financial Express (21 May 2021). "Kerala Ministers List 2021: Check full list of cabinet ministers and their portfolios" (in ఇంగ్లీష్). Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Scroll (24 December 2023). "Kerala: Transport, ports ministers resign in mid-term cabinet reshuffle". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.