ఆంగికాభినయం

చతుర్విధ అభినయములు లలో మొదటిది. మానవుడు చలన జీవి అవడంతో ప్రాణమున్నంత వరకు చలిస్తూనే ఉంటాడు. ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి భాషే కాకుండా వివిధ అంగాలు లేదా అవయవాలను కూడా ఉపయోగిస్తాడు. ఒక్కోసారి రెండూ ఉపయోగిస్తాడు. ఒక్కోక్కపుడు తల ఊపుతాడు. ఏమాత్రం చలనం లేకుండా మాట్లాడితే శిలప్రతిమ మాట్లాడినట్లు ఉంటుంది. సహజత్వం చచ్చిపోతుంది.

ఆంగికాభినయం చేస్తున్న బాలిక

లోక వృత్తానుకారి, లోక ప్రతిబింబము అయిన నాటక ప్రదర్శనలో నటులు చేతులు, ఇతర అవయవాలతో భావాన్ని వ్యక్తీకరించడమే ఆంగికాభినయం.[1]

దీనికి లోకమే ప్రమాణం. ఇది లోక వృత్తానుకరణం. లోకంలోని ప్రజలు ఏయే అవస్థలలో చేతులు, ఇతర అవయవాలను ఎలా కదుపుతారో బాగా గుర్తించి, ఆయా విన్యాసాలను అభ్యసించి తనవిగా చేసుకొని రంగస్థలంపై ప్రదర్శించాలి. మానవుల వైఖరి, అంగ విక్షేపం వివిధ రకాలుగా సంలోషంతో ఉన్నపుడు ఒకవిధంగా, బాధలో ఉన్నపుడు మరోవిధంగా ఉంటుంది. ఒకే అవస్థలో భిన్న వ్యక్తులు భిన్న భిన్న రీతుల్లో ప్రపర్తిస్తారు. అవయవాల చలనం కూడా భిన్నంగా ఉంటుంది. ఆయా పాత్రల దేశ కాల మతాదులనుబట్టి మారుతుంది. ఒకే వ్యక్తి ఇతరులతో మాట్లాడేటపుడు బాంధవ్యాలనుబట్టి అవయవ విన్యాసం మారుతూఉంటుంది.

మూలాలుసవరించు

  1. telugu, NT News (2021-09-05). "'వాగ్భూషణమే భూషణం' అని చెప్పినవారు?". Namasthe Telangana. Archived from the original on 2021-09-05. Retrieved 2022-10-18.