ఆంగ్లేయ దేశ చరిత్రము
ఆంగ్లేయ దేశ చరిత్రము అనే ఈ గ్రంథం బ్రిటీష్ ఇండియా కాలంలో ఏ క్లాస్ కొరకు నిర్దేశించింది. అందుకు పింగళి లక్ష్మీకాంతం ఈ గ్రంథాన్ని అనువదించారు.
రచన నేపథ్యం
మార్చుభారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నప్పుడు భారతీయులను చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు వారు ప్రయోగించిన అత్యంత ప్రమాదకర ఆయుధం విద్యావిధానం. భారతీయుల ప్రాచీన విద్యకు దూరం చేసి తమకు అనువైన విధంగా వారి చరిత్రను వ్యాఖ్యానం చేసి తమ చరిత్రలను వారిచేత చదివించారు. మొదట్లో ఆంగ్లేయులు భారతీయ భాషలపై శ్రద్ధ వహించి నేర్చుకుని పరిపాలించినా, లార్డ్ మెకాలే చేసిన విద్యాసంస్కరణల అనంతరం భారతీయుల చేతనే తమ ఆంగ్లభాష, ఆంగ్లేయ ఆచారాలు, ఆంగ్లేయుల చరిత్ర మున్నగునవి చదివించారు. అదే క్రమంలో రచించిన గ్రంథమిది. ఆంగ్లేయులు ఏ క్లాసు కొరకు నిర్దేశించిన సిలబస్‌కు అనుగుణంగా పింగళి లక్ష్మీకాంతం తెలుగులోకి అనువదించిన పాఠ్యగ్రంథం ఇది. ఈ పుస్తక మూలం ఎల్.జి.బ్రెండన్ రచించగా, అనువాదం పింగళి లక్ష్మీకాంతం చేశారు.
విషయం
మార్చుఆంగ్లేయుల చరిత్రను వందల ఏళ్లపాటు ఇందులో రచించారు. దీనిలో సెల్టుల కాలం నుంచి 18వ శతాబ్ది నాటి విక్టోరియా పాలన వరకూ ఆంగ్లేయ దేశ చరిత్ర క్రమాభివృద్ధిని వివరించారు.