ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక
1910 నుండి ఆంధ్రపత్రిక 'ఉగాది సంచిక'లను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరాది సంచికలు ఎక్కువ పేజీలతో ప్రత్యేక వ్యాసాలు, ఇతర రచనలతో విలక్షణంగా ఎప్పటికీ దాచుకొనేవిగా ఉండేవి. మొదటి ఉగాది సంచికలో 248 పేజీలు 126 చిత్రపటాలు ఉన్నాయి. కేవలం ముద్రణకే రెండు నెలలు పట్టేదట. అప్పటి ప్రసిద్ధ రచయితలు, పరిశోధకులు, కవులు ఇందులో రచనలు చేశేవారు. సంవత్సరం మొత్తంలో జరిగిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘటనలను ఇందులో ప్రస్తావించేవారు[1].ఇందులో కొ. వెంకటరత్నశర్మ, నేమాన సూర్యప్రకాశము, బాలకవి భోగరాజు నారాయణమూర్తి,అష్టావధాని రామడుగు సీతారామశాస్త్రి
ఆంధ్రపత్రిక
మార్చుసంవత్సరాది సంచిక
మార్చువివిధ వ్యాసములతోను, జిత్రపటములతోను,
నాంధ్రపత్రికాధిపతిచే బ్రకటింపబడి
బొంబాయి తత్వవివేచకముద్రాక్షరశాలలో ముద్రింపబడినది.
సాధారణనామ సం|| చైత్రశుద్ధపాడ్యమి భానువాసరము.
మార్చుబొంబాయి.
మార్చుఇందులో ఆంధ్ర మాహాజనులకొక విన్నపము అన్న వ్యాసం నుండి కొన్ని పేరాలు ఇది అప్పటి పత్రిక లలో వాడుకలో గ్రాధిక భాషకు ఒక ఉదాహరణ[2]
పూర్వఖండమున నవశక్తి యంకురించినది మొద లు, మన దేశము నన్ని చోట్లను, అన్ని తెగల వారును, అన్ని భాషలవారును దమతమయభ్యున్నతికొర కు బాటుపడుచుండుట తమరండ తెఱిఁగినవిషయమే. వివిధ వార్తాపత్రికలు దేశోన్నతి మార్గములను గురించి వివిధగతుల సూచించుచుండుటయుఁ దమకు తెలియని సంగతి కాదు. వానితోబాటు మాయాంధ్రపత్రికా పుత్రికామణియుఁ, దన దేశీయుల భాగ్యోదయమునకు సాధనభూతమగు నుపాయమును, తనకుఁదోచినట్లు, వచ్చి యురాని నుడువులతో నాంధ్రదేశ మహాజను లగు విద్వబ్బృందమునకు, నత్యంత వినయముతో నివే దింప మిక్కిలి కుతూహలముగలదియై, తమసముఖ మున నిలిచియున్నది. జ్ఞానమునను, బుద్ధిని, గుణము నను, అనుభవమునను గడువృద్ధులై యున్న తమరు మాబాలిక ముద్దుపలుకుల నాలకించి, గుణదోషములఁ బరిశీలించి, దాన గుణము లవమాత్రమున్నను, అనుగ్రహించి గ్రహించి, యాశీర్వదింతురని ప్రార్థించుచు న్నాము.
దేశ బాంధవులార! మన భారత దేశము, వందలకొ లఁది భాషలు, వందలకొలఁది జాతులు, వందలకొలది మతములనుగలిగి యుండుటఁబట్టి, యొక మహాఖండ మనఁదగియున్నది. ఈఖండములోని జనులు, ఒక్క భారతమాత గర్భమునఁబుట్టిన వారయ్యును, జిరకా లముగా వివిధమత ప్రవిష్ణులె, వెవ్వేలు భాషల మాట లాడుచు, వేఱు వేఱు ప్రదేశముల నివసించుచు, భిన్నా చార వ్యవహారములఁగలిగి ప్రవర్తించుచు తోనొకరుగలసి మెలసియుండు మానుషస్వభావము నకు నజ్ఞానవశమునను, సాధనాభావకారణమునను, దూరు లై య క కష్టములకుఁ బాల్పడి, తుదకు దైవా నుగ్రహమును బట్టియు, దమభాగ్యోదయమునుబ ట్టియు, నాంగ్లేయసత్ప్రభువులను, డమకుఁ బాలకులు గాఁ బడయఁగాంచిరి, ఈసత్ప్రభువులు ఈ దేశమున నడుగిడినది మొదలు, మన దేశీయులువిద్యలోను, బుద్ధి లోను, గుణములోను ఆత్త గౌరవములోను,ఆచారవ్య వహారములలోను, వాణిజ్యములోను,దినదినమభివృద్ధిని గాంచుచు, నేఁటికి మన దేశమున నొక్కొక్క మహనీతీరదు. కావున మన ప్రభువులైన యాంగ్లేయులును, ఆమనుష్య నరములో చేరిన వారగుటవలన, వారిపాల వలో లోపములుండకమానవు. కాని, వారి న్యాయపా లనవలన మన దేశమునకు గలుగుచున్న మేలును గురించి యోచించి చూచిన, వారిలోపములొక గొప్ప గాగానరావు. వారు మనజనులకుఁ బ్రసాదించిన వి ద్యాస్వాతంత్యములను బట్టి, మన వారిప్పు ఇందతో రాజకీయోద్యోగములలో, నితరులక సూయఁ బుట్టిం చునంతటి గొప్ప పదవులను బొందియున్నారు. తమ పాలనలోని లోపములను వెలిపుచ్చుటకును, బ్రజల యభిప్రాయములను దమకుఁ దెలియ బరచుటకును, ముఖ్యసాధన భూతమైయున్న వార్తాపత్రి నిర్వహ ఇస్వాతంత్యమును దక్కినయ నేక ప్రజాస్వాతంత్య్ర ములతో మనకు వారను గ్రహించి యుండుటఁబట్టియె కద, నిన్న మొన్నఁ గన్ను దెఱచిన మాయాంధ్రపత్రి కయుఁ దమసాన్ని ధ్యముననిలిచి, సమయోచిత కార్యదేశీయ విద్యాభిమానులార ! | బహు భాషా జాతి మత భేదములు గల మన దేశ ములోని ప్రజలు, అందఱు నొకసారిగ నైకమత్యమ వలంబించి, యభివృద్ధి గాంతురనుమాట పట్టి మాట యని యనేక మహాజనుల యభిప్రాయమైయున్నది. కావున భాషలను బట్టి భిన్నత్వమునుగాంచిన వెవ్వేలు రాష్ట్రములవారు, వేజు వేఱుగఁ దమతమ భాషలను, దమత మయాచార వ్యవహారములను, గాలానుగుణ్య ముగ సవరించుకొనుచు, దమలో దాము ఐకమత్య మును గలుగఁ జేసికొనుచు, బుద్ధిని, బలమునను, వి ద్యను, ధనమునను పెద్ద పెరుగచు, సోదర రాష్ట్రముల వారితో సఖ్యభావమును వృద్ధిపరచుకొనుచుఁ, బ్రభు వులసమ్మతితో నభివృద్ధి గాంచుట సులభ మైనదియు సాధ్యమైనదియుగాఁ దోచుచున్నది. కావున నీవిష యమై మనయాంధ్ర దేశమును గురించి నుడువందల చినాము.
మూలాలు
మార్చు- ↑ "ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-31.
- ↑ Sambu Prasad. (1965). Andhra Patrika . SVCLRC, UDL TTD TIRUPATI. Venkat Krishna Rao &Soni,VIJAYAWADA.