ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబరు 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించి పాత సంప్రదాయాన్నే పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా మారుతుందని ఎక్కువ మంది అభిప్రాయం.

పొట్టి శ్రీరాములు

కొన్ని సంగతులు

మార్చు
  • మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది - 1953 అక్టోబరు 1
  • ఆంధ్రరాష్ట్రం తెలంగాణాతో కలిసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్గా అవతరించింది - 1956 నవంబరు 1
  • 2014 జూన్ 2 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు

మూలాలు

మార్చు
  • సాక్షి దినపత్రిక - 18-10-2020 - (నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం)
  • ఈనాడు దినపత్రిక - 28-10-2020 - (నవంబరు 1న ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం)

బయటి లింకులు

మార్చు