ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ.ఈ సంస్థ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను, వాటికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడం కోసం స్థాపించబడింది.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం (తిరుమల - తిరుపతి)

దేవాదాయశాఖ పరిధిలో లేని నామమాత్రపు ఆదాయం కలిగిన సి' కేటగిరీ దేవాలయాలకు ప్రభుత్వం తరుపున ధూపదీప నైవేద్య అవసరాలకు కొంత నెలవారీ సొమ్మును అందిస్తున్నారు, వీటి వార్షికాదాయం రూ. 50 వేల లోపే ఉంది. ఇలాంటి దేవాలయాలు పర్సన్ ఇన్ మేనేజ్‌మెంట్, మేనేజర్లు, గుమస్తాల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఇలాంటి కొన్ని దేవాలయాలను కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఒకో మేనేజర్‌ను గతంలో నియమించారు. అయితే మేనేజర్‌తో పాటు సిబ్బందికి నెలవారీ అధిక మొత్తంలో జీతభత్యాల కింద సొమ్ములు ఈ దేవాలయాల ఖాతాల నుంచే చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల దేవాలయాల్లో నిత్యం జరగాల్సిన సాధారణ పూజలతో పాటు, అభివృద్ధి పనులు దాదాపు నిలిచిపోయాయి. ఇలాంటి దేవాలయాలన్నింటిని స్థానికంగా గల పెద్దల ఆధీనంలోకి తీసుకురావాలని సంకల్పించి ధార్మిక పరిషత్ పేరుతో దేవాలయ పాలకవర్గానికే పూర్తి బాధ్యతలు అప్పగించినందువల్ల ప్రభుత్వపరమైన అజమాయిషీ దాదాపు కనుమరుగు కానుంది.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు