ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. టి .రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపాన నిషేధం విధించాడు. దీనికి ముందు రాష్ట్రంలో 1991 సంవత్సరములో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం లోని దూబగుంటకు చెందిన రోశమ్మ మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించింది.[1] ఈ గ్రామంతో మొదలైన మద్యపాన నిషేధ ఉద్యమం, రాష్ట్రమంతా విస్తరించి, దీనికి అప్పటి ప్రతిపక్ష రాజకీయ పార్టీ తెలుగుదేశం ఈ ఉద్యమానికి మద్దతు పొందింది. 1994లో ఎన్. టి .రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యపాన నిషేధం విధించారు.[2] వేలాదిమంది ప్రజలు, పార్టీకార్యకర్తలు, అభిమానుల సమక్షంలో లాల్‌బహదూర్‌ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ప్రమాణ స్వీకారం అనంతరం ఈ సంపూర్ణ మద్యనిషేధం ప్రకటిస్తూ ఫైలుపై తొలిసంతకం చేసారు.[3] ఈ ఉద్యమానికి గుర్తుగా ఆమె ఇంటి పేరు దూబగుంట రోశమ్మ గా పేరుగాంచింది. మధ్యపాన నిషేధ చరిత్రలో మిగిలిపోయిన దూబగుంట రోశమ్మ ఆగస్టు 2016 సంవత్సరంలో మరణించింది.

మద్యం తాగవద్దు

చరిత్ర మార్చు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1992 వ సంవత్సరంలో, దాదాపుగా, అన్ని మద్యం రకాల అమ్మకం, కొనుగోళ్ళు నేరంగా పరిగణించాలని, సారాయికి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం ద్వారా సారాయి నిషేధం వచ్చింది. అంతకు ముందు రాష్ట్రంలో ఉన్న వారుణ వాహిని విధానానికి ప్రభుత్వ సహకారం ఉండడంతో, గ్రామీణ ప్రాంతాలలో కల్లును, సారాయి విరివిగా అమ్మేవారు. దీని ఫలితంగా ఎక్సైజ్‌ సుంకంగా 1991-92 సంవత్సరపు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 10 శాతం కన్నా ఎక్కువ మొత్తం సారాయి మూలకంగా ఆదాయం వచ్చింది. ప్రభుత్వం చేసిన నిషేధం ప్రశ్నించబడుతున్నా, మహిళా ఉద్యమ ప్రభావం రాజకీయాలపై కనబడింది.

ఈ పోరాటం మహిళల వ్యక్తిగత బృందాలతో ప్రారంభమై తమ గ్రామాలలో సారాయి లేకుండా చూశారు. ముఖ్య కారణం సారాయివల్ల వారి జీవితాలు నాశనమైన స్వీయానుభవంతోను, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో స్వచ్ఛంద సంస్థలచే నడపబడిన అక్షరాస్యతా ఉద్యమంలో ప్రాధమిక అభ్యాసకులకు ఇచ్చిన కథల పుస్తకంలో ఆడవాళ్లు ఏ విధంగా సారాయికి బానిసలైన భర్తల చేతుల్లో బాధలు పడ్తున్నారో చెప్పడం, దీనితో మహిళలు చైతన్యవంతులై సారాయి ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళలు తాము సంపాదిస్తున్న కూలీ డబ్బులను వారి భర్తలు తాగడానికి తీసేసుకోవడమే కాకుండ, తాగొచ్చి హింసించడంతో తీవ్రంగా విసిగిపోయినారు. సారాయిని వినియోగించేవారి మీదకన్నా సారాయిని సరఫరా చేసేవారి పైన, సారాయి విక్రయము చేసే వారిపై ఆ మహిళలు దృష్టి పెట్టడం వలన చాలామంది క్రియారహితంగా మద్దతు ఇచ్చారు. ఆ మహిళల కార్యక్రమాలన్నీకూడ వారి వారి గ్రామాల వరకే పరిమితమవడం తో, స్వచ్ఛంద సంస్థల సహాయ సహాకారాలు లభించాయి. వారి పోరాటాన్ని స్థానిక మహిళలే స్వయంగా నడిపేవారు.

ఈ పోరాటం పేద, గ్రామీణ స్త్రీల నుండి మధ్యతరగతి, పట్టణ స్త్రీలు, గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడ సంపూర్ణ మద్యనిషేధానికి మద్దతు తెలిపారు. ఏది యేమైనప్పటికినీ రాజకీయ శక్తి పునాదులను వణికించేలాగా స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుండి పోరాటాలను చేసారు.[4]

నిషేధం ఎత్తివేత మార్చు

1994 లో ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే మద్య నిషేధాన్ని విధించారు. జూన్ 1, 1995 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, అమల్లోకి వచ్చే సరికి విఫలమయ్యారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఏరులైపారింది. రాష్ట్రంలోకి మద్యం రాకుండా ఆపడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేదాన్ని ఎత్తివేశారు.[5]

మూలాలు మార్చు

  1. G, Srinivas (2016-08-07). "నాడు ఎన్టీఆర్‌ను కదిలించిన దూబగుంట రోశమ్మ కన్నుమూత". telugu.oneindia.com. Retrieved 2021-09-01.
  2. "మద్యపానం నిషేధించాలని సలహ ఇచ్చింది నేనే ! - Oneindia Telugu". telugu.oneindia.com. 2017-11-21. Archived from the original on 2021-09-01. Retrieved 2021-09-01.
  3. "Vaartha Online Edition". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-03-26. Archived from the original on 2021-09-01. Retrieved 2021-09-01.
  4. https://te.vikaspedia.in/social-welfare/c38c3ec2ec3ec1cc3fc15-c1ac24c28c4dc2fc02/c2ec26c4dc2fc2ac3ec28-c28c3fc37c47c27c02
  5. "ఎడిటోరియల్‌: ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యమా? - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-09-01.