ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ

ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ అకాడమీ (ANDHRA PRADESH ACADEMY OF SCIENCES) ఆంధ్ర ప్రదేశ్‌లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడం, దానిని ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్రప్రభుత్వం సైన్స్ అకాడమీని 1963 సంవత్సరంలో స్థాపించింది. దీనిలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారు. వీరు తెలుగులో శాస్త్ర పరిశోధన గ్రంథ, పుస్తక ప్రచురణల అంశాలపై పనిచేస్తారు.[1]

లక్ష్యాలు మార్చు

  • శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం
  • ఉన్నత పాఠశాల స్థాయిలో సైన్స్ పాఠ్యపుస్తకాలను, పాఠ్యప్రణాలికలను ఆదునికంగా తయారు చేయడం
  • వివిధ విశ్వవిద్యాలయాలలో, విద్యాలయ కేంద్రాలలో గోష్ఠులు, సెమినార్లు నిర్వహించడం
  • సైన్స్ రంగంలో విశేష కృషి చేయు శాస్త్రవేత్తలను సత్కరించడం
  • ఉపన్యాసాలు, సెమినార్లు, పర్యటనలు, విహారయాత్రలు, ప్రదర్శనలు, విజ్ఞాన శాస్త్రాల పుస్తకాల పంపిణీ ద్వారా ప్రజలలో శాస్త్రీయ జ్ఞానం యొక్క ప్రచారం.
  • సైన్స్ మ్యూజియం స్థాపన.
  • సైన్స్ పై పుస్తకాలు, పత్రికల ప్రచురణ.
  • స్వచ్ఛంద విజ్ఞాన సంస్థలకు సహాయం చేయడానికి.

మూలాలు మార్చు

  1. "Home | AP Akademi of Sciences". www.apas.in. Archived from the original on 2020-09-22. Retrieved 2020-08-28.