ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ

(ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాటక, నాట్య, సంగీత కళలకు తరుగుతున్న ఆదరణ దృష్ట్యా వాటి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినదే సంగీత నాటక అకాడమీ. దీనిని 1957 లోనే సాహిత్య అకాడమీ తదనంతరం స్థాపించారు. రవీంద్ర భారతి ఈ అకాడమీకి చెందినదే.[1]

నృత్య, సంగీత, నాటకోత్సవాలను నిర్వహించడం, ఆయా కళలలో శిక్షణాలయ్హాలను సాంస్కృతిక సంస్థలకు, నిస్సయాయ స్థితిలో గల వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం చేయడం, మరుగున పడిఫోతున్న మన సాంప్రదాయ, జానపద కళారూపాల పునర్వికాసానికి కృషిచేయడం మున్నగు కార్యక్రమాలతో పాటు ఆయా రంగాలలో పరిశోధన చేయించి, గ్రంథాలు ప్రచురించే కార్యూక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చేపట్తింది. ఈ పథకం కింద సంస్కృతంలోని ప్రామాణిక సంగీత, నృత్య శాస్త్ర గ్రంథాలను అనువదించజేసి ప్రచురిస్తుంది. ఇంతవరకు "సంగీత రత్నాకరం" మొదటి భాగం, "వృత్త రత్నావళి" "భావ ప్రకాశనము" అనే గ్రంథాలను కూడా ప్రచురించింది. [2]

విధులుసవరించు

  • నాటకం, నాట్యం, సంగీతం, జానపద కళలు వంటి వాటిలో శిక్షణ
  • ఈ కళలలో విశేష కృషి జరుపుతున్న వారికి తగిన ప్రోత్సాహం
  • ఈ కళలను పరిశోధించుటకు, కళల యొక్క ప్రచురణలకు ఆర్థిక సహాయం అందించడం
  • ఈ కళల ద్వారా ప్రజలమధ్య సత్సంబంధాలు ఏర్పరచడం

కార్యక్రమాలుసవరించు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్వర్యంలో 1975 ఏప్రిల్ 12న రాక్షననాం ఉగాది నుండి వారం రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సభలను అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకళరావు, విద్యాశాఖామంత్రి మండలి వెంకట కృష్ణంరావు గార్లు అధ్యక్ష, నిర్వాహాధ్యక్షులుగా ఒక సంఘం ఏర్పడింది. ఈ సంఘం ప్రపంచ మహాసభలకు నాందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రదేశాలలోనూ, ఢిల్లీలోను సంగీత, నాటక, నృత్య, జానపద కళోత్సవాలను నిర్వహించే భాద్యతను, ఆయ రంగాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురించే భాద్యతను సంగీత నాటక అకాడమీకి అప్పగించడం జరిగింది. అందులో భాగంగా విజయవాడలో నాటకోత్సవాన్ని, అనంతపురంలో వీధినాటకం సదస్సును, నిజామాబాదులో నృత్యోత్సవాన్ని, తిరుపతిలో సంగీతోత్సవాన్ని, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ జానపద, నాటక కళోత్సవాన్ని ఈ అకాడమీ నిర్వహించింది. ఈ సందర్భంగా సంగీత, నృత్య, నాటక, చలన చిత్రాలకు సంబంధించిన గ్రంథాలను ప్రచురించింది. వాటిలో "మన వాగ్గేయకారులు తొలి సంకీర్తన కవులు" అనే గ్రంథం ఒకటి.[3]

ఇంకా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Pages - Modern". web.archive.org. 2010-01-24. Retrieved 2021-04-20.
  2. "సంగీత సంప్రదాయాల ప్రదర్శిని" (PDF). ibiblio.org. 01.11.1976. Check date values in: |date= (help)
  3. "మన వాగ్గేయకరులు - తొలి సంకీర్తన కవులు - పుస్తకం ముందుమాట" (PDF). tirumala.org. 01.04.1975. Check date values in: |date= (help)