ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు

ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు 17వ శతాబ్దం వరకు తెలుగు భాషలో విడుదలైన చారిత్రక కావ్యముల గురించి డాక్టర్ బి. అరుణకుమారి గారి పరిశోధన గ్రంథము. దీనిని 1978 సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ, వాల్తేరు ప్రచురించింది.

ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు
కృతికర్త: బి. అరుణ కుమారి
అంకితం: వెంకటరత్నమ్మ, బాలసుబ్బారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): పరిశోధన గ్రంథం
ప్రచురణ:
విడుదల: 1978
ముద్రణ: ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్, వాల్తేరు

క్రీ.పూ. 200 నుండి. సా.శ. 1700 వరకు ఆంధ్రదేశము లోని రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వాటి పరిణామములను విశదీకరించే ప్రయత్నమిది. ఇందులో భారతదేశంలో తెలుగు రాజ్యమును స్థాపించిన వల్లభుని అభ్యుదయ కథనము, చోళుల వీరగాథలు, మహోన్నతాంధ్ర సామ్రాజ్య స్థాపకులైన కాకతీయుల చరిత్ర, పలనాటి వీరుల శౌర్య ప్రతాపములు, కాటమరాజు కథ, ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడగు శ్రీకృష్ణదేవరాయని సమరౌద్ధత్యము, ఆరవీటి రాజుల చరిత్ర, నాయక రాజుల పాలనము, బసవేశ్వర పండితారాధ్యుల శైవమత ప్రచార సంరంభము, ఓరుగంటి ఆంధ్రుల సాంఘిక జీవనమును తెలుగు గాథలు మొదలైన విషయాలను విమర్శనాత్మక దృష్టితో కూర్చిన మణిహారమే ఇది.

ఈ పుస్తకాన్ని రచయిత తన అమ్మ శ్రీమతి వెంకటరత్నమ్మ, నాన్న శ్రీ బాల సుబ్బారావు గార్లకు భక్తితో అంకితమిచ్చారు.

విషయసూచిక

మార్చు
 1. చరిత్ర - చారిత్రక కావ్యము
 2. ఆంధ్ర మహావిష్ణువు
 3. చోళులు
 4. కాకతీయులు
 5. హైహయులు
 6. కాటమరాజు కథ
 7. శ్రీకృష్ణదేవరాయలు
 8. ఆరవీటి రాజులు
 9. తంజాపురాంధ్ర నాయకరాజులు
 10. మతము - మతప్రవక్తలు
 11. జీవిత చరిత్ర
 12. సాంఘిక చరిత్ర
 13. ఉపసంహారము

ప్రముఖుల అభిప్రాయాలు

మార్చు
శ్రీ యం.ఆర్.అప్పారావు, ఉపాధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం
 • ఈ గ్రంథములో డాక్టర్ అరుణకుమారి కడుంగడు ప్రశంసనియములగు ఎన్నియో విషయములను చర్చించిరి. ఈ గ్రంథము ఇటు చరిత్రకు, అటు వాజ్మయమునకు మిక్కిలి ఉపయోగపడుననుటకు సందియములేదు.
ప్రొఫెసర్ కె.వి.ఆర్. నరసింహం
 • ప్రాచీనాంధ్ర చారిత్రక కావ్యములపై రచింపబడిన సిద్ధాంత వ్యాసములలో ఇది ఉత్తమోత్తమము. చారిత్రక నేపథ్య వివరణముతోపాటు కావ్యకళా పరిశీలనమును ఇందు సక్రమముగా నిర్వహింపబడింది.
డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య
 • క్రీ.పూ. ద్వితీయ శతాబ్దమునుండి సా.శ. పదునేడవ శతాబ్దమువరకు ఆంధ్రుల చరిత్రను చాటిచెప్పు చారిత్రక కావ్యములను, సత్యాన్వేషివలె విశ్లేషించుటలో రచయిత్రి చూపిన పరిశోధనాభినివేశము ఎన్నతగినది.
డాక్టర్ దివాకర్ల వేంకటావధాని
 • చారిత్రక కావ్యములను కాలక్రమానుసారముగ తర్కబద్ధముగ మదింపు చేయుతరి వెలువడిన చారిత్రకాంశములయందలి సత్యాసత్యములను అందుబాటులోనున్న చరిత్రలదృష్ట్యా పరిశీలించుటయేగాక డాక్టర్ అరుణకుమారి వానియందలి సాహిర్యౌన్నత్యమును ఎత్తిచూపిరి.
డాక్టర్ కొర్లపాటి శ్రీరామమూర్తి
 • ఈ పరిశోధనా గ్రంథమునందు చారిత్రక సత్యములు సప్రమాణముగను కావ్యతత్వములు సవిమర్శముగ నిరూపింపబడినవి. నిరాడంబరమైన శైలిలో నివేదింపబడినవి. చరిత్ర జిజ్ఞాసువులకు, సాహిత్య పిపాసువులకు ప్రయోజనకరమైన యీ కృషి ప్రశంసాపాత్రము.

మూలాలు

మార్చు