ఆంధ్ర వాల్మీకి రామాయణం

ఆంధ్ర వాల్మీకి రామాయణం వావిలికొలను సుబ్బారావు రచించిన పుస్తకం.

Sri Vasudasa swamy Vavilikolanu subbarao.jpg
ఆంధ్ర వాల్మీకి రామాయణం రచయిత వావిలికొలను సుబ్బారావు

కవి పరిచయం

మార్చు

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనింగించిన వాడు ఆంధ్ర వాల్మీకి-కవిసార్వభౌమ వావికొలను సుబ్బారావు (వాసుదాసు). అతను వాసుదాసుగా రామభక్తులకు సుప్రసిద్ధుడు. ఆయన రామభక్తునిగా జీవితమంతా భక్తిలో గడిపారు. ఆయన చేసిన రామాయణానువాదం సుప్రసిద్ధం. ఈ గ్రంథరచన వల్లనే ఆయనకు ఆంధ్ర వాల్మీకి అన్న బిరుదు స్థిరపడింది. ఒంటిమిట్టలోని రామాలయాన్ని పునరుద్ధరించేందుకు టెంకాయ చిప్పలో భిక్షమెత్తి మరీ ధనం పోగుజేశారు. టెంకాయ చిప్ప రామసేవలో ధన్యత జెందిందంటూ టెంకాయచిప్ప శతకాన్ని రచించారు. ఈ గ్రంథం ఆయనను అజరామరంగా నిలిపిన వాల్మీకి రామాయణ ఆంధ్రానువాదం.

ఒంటిమిట్ట కోదండ రామస్వామికి 1908, అక్టోబర్ 9,10,11 తేదీల్లో ఈ దేవాలయంలో అంకితమిచ్చాడు. తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, ‘‘మందరం’’ అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించాడు.

నేపథ్యం

మార్చు

అతని బాబాయి లక్ష్మణరావుకి రామాయణాన్నినిరంతర పారాయణం చేసే అలవాటు ఉండేది. లక్ష్మణరావు అతనిని రామాయణ పారాయణానికి ప్రోత్సహించేవాడు. ఒకనాడు బమ్మెర పోతన పలికిన ‘చెనకకి చెరిచిననాడు భాస్కరుడు గాకుండిన రామాయణము బండ్ల కెక్కింపనా’ అన్న వాక్యాలు అతని మనసులో పడి అతని సంకల్పాన్ని నెరవేర్చాలన్న భావన కలిగింది. వాల్మీకి సంస్కృత రామాయణం మూలంలోని 24,000 పద్యాలను రాయాలని సంకల్పించాడు. 1900, ఆశ్వయుజ శుద్ధ దశమినాడు, గ్రంథ రచన ఆరంభించాడు. [1] ఈ గ్రంథాన్ని ఎలా ముద్రించిందీ అతను స్వయంగా చెప్పిన మాటలను ఆనాటి దినపత్రిక "ఆంధ్ర ప్రకాశిక" 1910 అక్టోబరు 17న ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న అనామక స్వదేశీ ప్రభువు ముందుకు వచ్చి ప్రతిఫలాపేక్ష లేకుండా, వేలాది రూపాయలను వ్యయం చేసి గ్రంథాన్ని ముద్రింపజేసాడు. అతను తన పేరుకు ఇందులో ప్రకటించడానికి అనుమతినివ్వలేదు.

ఈ గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కడప మండలం-పొద్దుటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న వసంతరావు నిర్వహించాడు. దీనికి సభాధ్యక్షునిగా శతావధాని ఉభయ వేదాంత ప్రవర్తకులు, న్యాయవాద వృత్తిలో ఉన్న శ్రీమద్ధర్మవరము రామ కృష్ణమాచార్యులు వ్యవహరించాడు. 1908, అక్టోబర్ 9,10,11 తేదీల్లో- అంటే కీలక నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, బహుళ పాడ్యమి-విదియ తిథులలో ‘కావ్య సమర్పణ జరిగింది.

మూలాలు

మార్చు
  1. "పలికించిన వాడు రామభద్రుడు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2018-08-16. Retrieved 2020-09-16.

బాహ్య లంకెలు

మార్చు