ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్థులు తేవడం సంప్రదాయం.[1]

ఆకాశ గంగ చిత్రం

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కి.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది.[2] హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయింది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం.

మూలాలు మార్చు

  1. "Tirumala Akasaganga History | Akasha Ganga Theertham Water Fall in Tirupati". Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-16. Retrieved 2021-05-07.
  2. V N, Praveen. "Tirumala Akasha Ganga Darshan Timings Theertham Route Distance". Prayanamam. Prayanamam. Retrieved 18 August 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకాశ_గంగ&oldid=3829294" నుండి వెలికితీశారు