ఆకుపచ్చ కాంతి యొక్క ధృగ్గోచర పటంలో నీలము, పసుపుపచ్చ మధ్యలో ఉండే రంగు. 495-570 నానోమీటర్ల తరంగదైర్ఘ్యం కల కాంతి కిరణాలచే ఈ రంగు వెలువడుతుంది. చిత్రకళలో, వర్ణముద్రణలో ఈ రంగును పసుపుపచ్చ, నీలం లేదా పసుపుపచ్చ, సయాన్ రంగులను కలపడం ద్వారా ఆకుపచ్చను సృష్టిస్తారు. టెలివిజన్, కంప్యూటరు తెరలలో ఉపయోగించే ఆర్.జీ.బి వర్ణ అనుక్రమణలో ఇది ఎరుపు, నీలం రంగులతో పాటు ఇది ఒక ప్రాథమిక వర్ణం. ఈ ప్రాథమిక వర్ణాల వివిధ మిశ్రమాలతో ఇతర వర్ణాలను సృష్టించబడతాయి.

ఆకుపచ్చ
 
Spectral coordinates
తరంగదైర్ఘ్యం495–570 nm
పౌనఃపున్యం~575–525 THz
About these coordinates     Color coordinates
Hex triplet#008000
sRGBB  (rgb)(0, 128, 0)
SourcesRGB approximation to NCS S 2060-G
B: Normalized to [0–255] (byte)

తెలుగు భాషలో ఆకుపచ్చను, పసుపు పచ్చను కలిపి పచ్చగా వ్యవహరిస్తారు. సందర్భోచితంగా అది పీతవర్ణాన్ని సూచిస్తుందో, హరితవర్ణాన్ని సూచిస్తుందో శ్రోతలు గుర్తిస్తారు. ఈ ఆయోమయాన్ని పోగొట్టడానికి ఆకుపచ్చ, పసుపుపచ్చ అని వ్యవహరించడం జరుగుతుంది.

మూస:Brown tick

"https://te.wikipedia.org/w/index.php?title=ఆకుపచ్చ&oldid=4196887" నుండి వెలికితీశారు