ఆకొండి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. ఈ ఆకొండి వారు పండితులుగాను, అధ్యాపకులు గాను ఆంధ్రప్రాంతమందు పేరుపొందినారు.

  • 19 వ శతాబ్దిలో ఆకొండి వేంకటశాస్త్రిగారు (తిరుపతి వేంకట కవులలో ఒకరు) పండిత కవులుగాను వేంకటేశ్వర శతకమును రచించినట్లు తెలుస్తోంది.
  • 20వ శతాబ్దిలో ఆకొండి శంకరశాస్త్రిగారు వారి కుమారులు వేదపండితులుగా ప్రఖ్యాతి గాంచారు. వీరి కుమారులు ఆకొండి వ్యాసమూర్తిగారు, సుబ్రహ్మణ్యంగారు, వేంకటశాస్రిగారు, సింహాద్రిగారు, ఆకొండి సూర్యనారాయణమూర్తి గారు వీరు అందరు కొనసీమలో మంచిపేరు గల వేద పండితులు. ప్రస్తుతం వీరి కుమారులు కొందరు వేద పండితులుగాను, మరి కొందరు ఉపాధ్యాయులుగాను ఉన్నారు.వీరు తూర్పుగోదావరి జిల్లానందు గల అమలాపురం, కట్రేనికోన గ్రామములందు నివసిస్తున్నారు. వీరిలో ఆకొండి వేంకట శాస్త్రిగారు కాట్రేనికోనలో ఆయుర్వేద వైద్యులుగా 104 సంవత్సరాలు జీవించారు. ప్రస్తుతం వేదపండితులు శ్రీ ఆకొండి సూర్యనారాయణమూర్తి గారు గత 50 సంవత్సరములుగా ఋగ్వేదమును ఉచితముగాఎందరో విద్యార్థులకు నేర్పుచున్నారు. ప్రస్తుతము వీరికి 98 సంవత్సరములు. ఆకొండి సూర్యనారాయణ మూర్తి గారికి 11 మంది సంతానము. 5గురు కుమారులు, 4గురు కుమార్తెలు మిగిలి ఉన్నారు. సూర్యనారాయణ మూర్తి, విశ్వనాధము, శంకరశాస్త్రి, కృష్ణమూర్తి, శ్రీరామ చంద్రమూర్తి కుమారులు, మహాలక్ష్మి, వర్ధనమ్మ, వ్యాసమ్మ, సూర్యకాంతము, లక్ష్మి - కుమార్తెలు.
  • ఆకొండి వేంకటకవి
  • ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి
  • ఆకొండి రామమూర్తి శాస్త్రి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారి మాతామహులు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆకొండి&oldid=3109750" నుండి వెలికితీశారు