చెయ్యడం ద్వారా నేర్చుకోవడం

(ఆచరిస్తూ నేర్చుకోవడం (learning by doing) నుండి దారిమార్పు చెందింది)

చెయ్యడం ద్వారా నేర్చుకోవడం అనే విద్యా సిద్ధాంతాన్ని అమెరికన్ తత్వవేత్త జాన్ డ్యూయీ వివరించారు. చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే విద్యార్థి వారి స్వంత చర్యల నుండి నేరుగా నేర్చుకోవడం.[1] యూనివర్సిటీ ఆఫ్ చికాగో లాబొరేటరీ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా డ్యూయీ ఈ ఆలోచనను అమలు చేశారు.[2] ప్రగతిశీల విద్యా విధానాలను నెలకొల్పడంలో ఆయన అభిప్రాయాలు ఎంతో ముఖ్యమైనవి. ఉదాహరణకు, రిచర్డ్ డుఫోర్ "చెయ్యడం ద్వరా నేర్చుకోవడం" సిద్ధాంతాన్ని వృత్తి పరమైన అభ్యసన సంఘాల (ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీస్) అభివృద్ధికి అన్వయించారు.

"I believe that the school must represent present life-life as real and vital to the child as that which he carries on in the home, in the neighborhood, or on the playground."

—జాన్ డ్యూయీ (My Pedagogic Creed)

"… The teachers were to present real-life problems to the children and then guide the students to solve the problem by providing them with a hands-on activity to learn the solution ... Cooking and sewing were to be taught at school and be a routine. Reading, writing, and math was to be taught in the daily course of these routines. Building, cooking, and sewing had these schooling components in it and these activities also represented everyday life for the students."

—పెగ్గి హిక్మాన్

జాన్ డ్యూయీ తాను రాసిన "డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్" అనే పుస్తకం లో ఈ సూత్రాలను వివరించారు.

చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే, ఒకరి స్వంత చర్యల నుండి అనుభవపూర్వకంగా నేర్చుకోవడం, ఒక ప్రదర్శన  చూడటం, ఇతరుల సూచనలు, వర్ణనలను చదవడం, ఉపన్యాసాలను వినడం వంటివి కాకుండా వారికై వారు ప్రత్యక్షంముగా చూసి, చేసి, అవి నేర్చుకోవడం. చేయడం ద్వారా నేర్చుకోవడం (లెర్నింగ్-బై-డూయింగ్) సూత్రం విస్తృతంగా  అనేక రూపాల్లో సూచించబడింది, వీటిలో నేర్చుకోని - ఆచరించటం, ట్రయల్-అండ్-ఎర్రర్ లెర్నింగ్ , డిస్కవరీ వర్సెస్ ఇన్స్ట్రక్షన్, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వర్సెస్ బుక్ లెర్నింగ్, ప్రాక్టీస్-థియరీ-ప్రాక్టీస్ డయలెక్టిక్, “ప్రూఫ్ అప్ఆన్ ప్రాక్టీస్” ఇవి అన్ని ప్రాక్టీస్ అనే అర్థంలో ఉద్దేశించబడినవి. ఇవి లక్ష్యం-నిర్దేశించిన ప్రవర్తన "గోల్-డైరెక్ట్ బిహేవియర్" అనే పదబంధాన్ని అభిజ్ఞా కోణంలో అర్థం చేసుకోవచ్చు. కీలింగ్, పోలాసెక్, ఇంగ్రామ్ (2009) చేసిన అధ్యయనంలో “మంచి ప్రశ్నలను అడగడం నేర్చుకోవడం” అనే ఉపవిభాగంలో ఇది చర్చించబడింది. [3]

భోధన - చెయ్యడం ద్వారా నేర్చుకోవడం భిన్నత్వాలు

మార్చు
 
Laurentius de Voltolina 001

తరగతి భోధన లో ఒక ఉపాధ్యాయుడు తన బోధనా వ్యూహాలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. కానీ ఆ విద్య ప్రతి ఒక విద్యార్థి కి అర్ధం అవుతుంది అని లేదు, తరగతి లోని విద్యార్థులు కూడా శ్రద్దగా పాఠాన్ని వినకపోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న చిత్రం లో ఉపాధ్యుడు పాఠం చెపుతుంటే కొందరు విద్యార్థులు శ్రద్దగా వింటున్నారు, కొందరు తాము విన్నది వ్రాసుకుంటున్నారు, కొంత మంది విద్యార్థులు పక్కన విద్యార్థులతో మాట్లాడగా మరి కొందరు నిద్ర పోతున్నారు.[4]

మానవులు సహజ అభ్యాసకులు. నేర్చుకోవడం మెరుగుపరచడానికి ఒక మార్గం, చేయడం ద్వారా నేర్చుకోవడం. ఈ పద్దతిలో, విద్యార్థులు చురుకుగా అన్వేషించి నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ చేయడం ద్వారా నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను నమ్ముతారు, కాని ఎక్కువ ఆచరణలో పెట్టలేదు. చేయడం ద్వారా నేర్చుకోవడం మన సాధారణ విద్య రూపం కాకపోవడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదట, సరైన ఉపకరణాలు లేకుండా అమలు చేయడం చాలా కష్టం. రెండవది, చేయడం ద్వారా అభ్యాసాన్ని ఎలా అమలు చేయాలో ఉపాధ్యాయులకు అర్థం కాలేదు.[5]

చికాగో విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం శాస్త్రీయ ఆలోచనలను నేర్చుకునే విద్యార్థులు వాటిని మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా వర్చువల్ ప్రయోగశాలలు, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రపంచంలో ఈ పద్దతి ద్వారా వచ్చే అనుభవాలు విద్యార్థులకి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయని వివరిస్తున్నారు సియాన్ బీలాక్, ఆమె సహ రచయితలు డెపాల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సుసన్ ఫిషర్, యుచికాగో గ్రాడ్యుయేట్ విద్యార్థి కార్లీ కొంట్రా, పోస్ట్‌డాక్టోరల్ స్కాలర్ డాన్ లియోన్స్.[6]

పాఠ్యపుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని గురించి చదవడం లేదా తరగతిలో ప్రదర్శనను చూడటం కూడా మీరు నేర్చుకుంటున్న వాటిని ఆచరణాత్మకంగా శోధించడం లాంటిది కాదు. "కష్టసాధ్యమైన సైన్స్ ప్రక్రియలను ఆచరణాత్మకంగా శోదించే విద్యార్థులు వాటిని బాగా నేర్చుకుంటారు, మరుసటి రోజు తరగతిలో, క్విజ్‌లలో మెరుగ్గా రాణిస్తారు. ప్రభావం వారాల తరువాత కూడా కనిపిస్తుంది" అని బీలాక్ జోడించారు.

అభ్యాసం అనేది ముఖ్యమైన ఆవిష్కరణ ప్రక్రియ. మానవులు సహజ అభ్యాసకులు. కొన్ని విషయాలు పిల్లలు తమను తాము కనుగొంటారు మనము చెప్పక ముందే. సహజమైన అవగాహన చక్రం - నిరీక్షణ వైఫల్యం - వివరణ - గుర్తుచేయడం - సాధారణీకరణ కలిగి ఉంటాయి.

ప్రయోజనాలు[7]

మార్చు
  • సహకార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.
  • రిస్క్ తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
  • విమర్శనాత్మక ఆలోచనను మెరుగుపరుస్తుంది.
  • ఆసక్తి పెంచుతుంది.
  • జ్ఞాపక శక్తి పెంచుతుంది.
  • సృజనాత్మక ఆలోచనకు దారితీస్తుంది.
  • నిజమైన సమస్య పరిష్కారాన్నికి ప్రోత్సహిస్తుంది.
  • విద్యార్ధి సంసిద్దత.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "John Dewey on Education: Impact & Theory - Video & Lesson Transcript". Study.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-05.
  2. "D is for John Dewey: His Approach To Education". The Positive Encourager (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-08-30. Retrieved 2020-08-05.
  3. "APA PsycNet". psycnet.apa.org (in ఇంగ్లీష్). Retrieved 2020-08-10.
  4. Roncevic, Milan (2017-05-05). "Did Technology Change Education?". YouTestMe (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-08.
  5. "What We Learn When We Learn by Doing". www.cogprints.org. Archived from the original on 2020-07-21. Retrieved 2020-08-08.
  6. "Learning by doing helps students perform better in science". University of Chicago News (in ఇంగ్లీష్). Retrieved 2020-08-10.
  7. Whenham, Tricia. "9 benefits of active learning (and why your college should try it)". www.nureva.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-05.